తెలంగాణాలో కరోనా కేసులకు సంబంధించి నేడు తెలంగాణా హైకోర్ట్ లో అత్యవసర విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్ట్ కీలక ప్రశ్నలు వేసింది. కరోన పరిస్థితులుపై వాదనలు వాడి వేడిగా సాగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుని రాష్ట్ర హైకోర్ట్ ఆద్యంతం తప్పుబట్టింది. అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్స్ ఎందుకు నిలిపివేస్తున్నారు అంటూ హైకోర్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఛత్తీస్గఢ్, మహా రాష్ట్ర, కర్ణాటక నుండి ఆర్ ఎం పి డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ తో ఇక్కడికి వస్తున్నారు అని ఏజీ వివరించారు.

హైదరాబాద్ అనేది మెడికల్ హబ్ అని చెప్పిన హైకోర్ట్... ఆరోగ్యం కోసం ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారు అని తెలిపింది. ప్రజలను ఇక్కడికి రావొద్దు అని చెప్పడానికి మీకు ఎం అధికారం ఉంది అని నిలదీసింది. హాస్పిటల్ లో వైద్యం కోసం వచ్చే వారిని మీరెలా అడ్డుకుoటారు అని  నిలదీసింది. కేర్, అపోలో ఆస్పత్రిలో అంతర్జాతీయ పేషంట్లు ఉంటారు వాళ్ళను కూడా అడ్డుకుంటారా  అని ప్రశ్నించింది. దేశ రాజధాని ఢిల్లీ కి కూడా ఎంతో మంది పేషంట్లు ఎన్నో రాష్ట్రాల నుండి వస్తుంటారు అని... అలా అని ఢిల్లీ లో అంబులెన్స్ లను అడ్డుకున్నారా అని నిలదీసింది.

ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే అంబులెన్స్ లను ఆపడం ఏంటి అని నిలదీసింది. గతంలో మేం చెప్పినట్టు మొబైల్ టెస్ట్ లను కూడా మీరు నిర్వహించలేక పోయారు కానీ ఇప్పుడేమో అంబులెన్స్ లను ఆపేస్తున్నారు అని ప్రశ్నించింది. ఇక దీనిపై కీలక ఆదేశాలు ఇచ్చింది హైకోర్ట్. సరిహద్దులో అంబులెన్స్ లను నిలిపి వేయవద్దు పోలీసులకు హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. ఇక దీనిపై స్పందించిన అడ్వకేట్ జనరల్... లాక్ డౌన్ సందర్భంగా ఎమర్జెన్సీ పాస్ లను ఇస్తామని వివరించించారు. బార్డర్ వద్ద  అంబులెన్స్ నిలిపివేత  అదేశాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. లిఖితపూర్వ అదేశాలు లేవని చెప్పగా మరి ఓరల్ ఆర్డర్స్ ఉన్నాయా అని నిలదీసింది. సిఎస్ ని అడిగి చెప్తామని ఏజీ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: