మంత్రి కొడాలి నాని...ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకుడు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పేరు చెబితే చాలు ఒంటికాలి మీద వెళ్ళే నాయకుడు. అసలు ఏ మాత్రం మొహమాటం లేకుండా చంద్రబాబుని పరుష పదజాలంతో విమర్శించే నాయకుడు. నాని టీడీపీని వీడి ఎప్పుడైతే వైసీపీలోకి వెళ్లారో అప్పటినుంచి చంద్రబాబుపై విరుచుకుపడుతూనే ఉన్నారు.


ఇక ఇప్పుడు మంత్రి అయ్యాక మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబుని గట్టిగా టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు. అసలు రాజకీయాల్లో విమర్శలు కూడా ఇలా ఉంటాయా అనే రేంజ్‌లో మాట్లాడుతున్నారు. అయితే నానికి టీడీపీ నేతలు కూడా గట్టిగానే కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అయినా సరే నాని ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మాట్లాడతారు.


తనపై ఎన్ని విమర్శలు చేస్తే అంతకు రెట్టింపుగానే నాని మాట్లాడతారు. అయితే నాని, బాబుపై విమర్శలు చేస్తే టీడీపీలో కొందరు నాయకులు మాత్రమే స్పందిస్తారు. మిగతా నాయకులు పెద్దగా పట్టించుకోరు.  ముఖ్యంగా కృష్ణా జిల్లా టీడీపీ నేతలు నానికి పెద్దగా కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేయరు. ఏదో దేవినేని ఉమా, బుద్దా వెంకన్న, బోండా ఉమా లాంటి వారు నానిపై విమర్శలు చేస్తారు గానీ, మిగిలిన నాయకులు పెద్దగా స్పందించరు.


అందులోనూ కమ్మ సామాజికవర్గం నేతలు నానికి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేయరు. కేశినేని నాని, గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్‌లతో పాటు జిల్లాలో ఉన్న పలువురు కమ్మ నాయకులు నాని జోలికి వెళ్లరు. అసలు గుడివాడ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న రావి వెంకటేశ్వరరావు సైతం నానిపై విమర్శలు చేయడానికి వెనుకాడుతున్నారు.


అయితే నాని విషయంలో వీరు పెద్దగా స్పందించకపోవడానికి కారణాలు లేకపోలేదు. అసలు నాని ఎక్కువగా చంద్రబాబుని, దేవినేని ఉమానే టార్గెట్ చేసి మాట్లాతారు తప్పా, మిగతా టీడీపీ నాయకులపై విమర్శలు చేసిన సందర్భాలు తక్కువ. అందులోనూ కృష్ణా జిల్లాలోని టీడీపీ నేతలపై నాని పెద్దగా విమర్శలు చేయరు. అందుకే టీడీపీ నేతలు కూడా నాని, చంద్రబాబుపై చేసే విమర్శలకు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేయరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: