ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తిరుపతి ఎపిసోడ్ అంటే చాలు...అందరికీ గుర్తొచ్చేది నారా లోకేష్‌పై చేసిన కామెంట్లు. ఊహించని విధంగా తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో ఓ టీడీపీ నేత పార్టీ కేడర్‌ను చంద్రబాబు, లోకేష్ వాడుకుని వదిలేస్తున్నారని.. అచ్చెన్నాయుడి ముందు గోడు వెల్లబోసుకున్నాడు. బ్రదర్ అంటూ ఒకప్పుడు మాట్లాడే లోకేష్.. ఇప్పుడు కూర్చో అమ్మా అంటూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని. పార్టీ కోసం 30 ఏళ్లు కష్టపడ్డ తనకు అన్యాయం చేశారంటూ ఆవేశపూరితంగా మాట్లాడారు.


ఇక మొదట సర్ధి చెప్పేందుకు ప్రయత్నించిన అచ్చెన్నాయుడు మధ్యలో కలుగచేసుకుని. లోకేష్‌ను‌ ఉద్దేశించి ఆయనే సరిగా ఉంటే పార్టీకి ఈ దుస్థితి వచ్చేది కాదని, తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీ లేదు.. ఏమి లేదంటూ ఆ టీడీపీ నేతకు వత్తాసు పలికారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.


ఇక దీన్ని వైసీపీ నేతలు ఏ విధంగా వాడుకున్నారో తెలిసిందే. ఈ వీడియోని అడ్డం పెట్టుకుని టీడీపీ పని అయిపోయిందని ప్రచారం చేశారు. అయితే ఈ వీడియో బయటకొచ్చాక అచ్చెన్నాయుడు దూకుడు కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. మునుపటిలాగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదు. ఏదో పేపర్ స్టేట్‌మెంట్స్ వరకే పరిమితమవుతున్నారు. అటు చంద్రబాబు సైతం అచ్చెన్నకు పవర్స్ తగ్గించేసినట్లు కనిపిస్తోంది.


ఏదేమైనా ఆ వీడియో అచ్చెన్నకు బాగా మైనస్ అయింది. అయితే ఇదే సమయంలో తాజాగా వైసీపీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్, ఆకుల సత్యనారాయణలు ఓ రూమ్‌లో కూర్చుని జగన్‌పై విమర్శలు చేసిన వీడియో బయటకొచ్చింది. అసలు కరోనా కట్టడిలో జగన్ చేతులెత్తేసారని మాట్లాడుకున్నారు.


ఇక ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే టీడీపీ నేతలు ఈ వీడియోని గట్టిగానే ప్రచారం చేయడానికి చూశారు. కానీ అచ్చెన్నాయుడు నెగిటివ్ అయినట్లు, వైసీపీ నేతలు నెగిటివ్ అవ్వలేదు. మొత్తానికైతే ఒక్క వీడియో అచ్చెన్న రాజకీయాన్నే మార్చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: