క‌రోనా సోకిన 14 రోజుల త‌ర్వాత ప‌రీక్ష చేయించుకుంటే నెగెటివ్ అని వ‌స్తుంది. నెగెటివ్ అని వ‌చ్చినంత‌మాత్రాన పూర్తిగా త‌గ్గిపోయిన‌ట్లుకాద‌ని అర్థం చేసుకోవాలి. క‌రోనా పాజిటివ్ అని తేలి స్వీయ నిర్బంధంలో 14రోజుల చికిత్స తీసుకున్న త‌ర్వాత ప‌రీక్ష చేయించుకున్నా ఉప‌యోగం ఉండ‌దు. ఎందుకంటే నెగెటివ్ అనే చూపిస్తుంది. వైర‌స్ లేక‌పోయినా దానివెంబ‌డి వ‌చ్చే దుష్ప‌రిణామాలు చాలావుంటాయి. క‌చ్చితంగా మూడునెల‌ల‌పాటు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఎంత ఆహారం తీసుకుంటున్నా నీర‌సంగా ఉండ‌టం.. దాహం వేయ‌డం.. ప్ర‌తి చిన్న ప‌నికి అల‌సిపోతుండ‌టం స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ని చెబుతున్నారు. కుటుంబ స‌భ్యుల‌కు 28 రోజుల‌పాటు దూరంగా ఉంటే మేలని వైద్యులు చెబుతున్నారు.

పాజిటివ్ అంటే.. క‌రోనా పాజిటివ్ అని కాదు..
క‌రోనా అని తేల‌డంతో కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. మ‌నిషి శ‌రీరంలో వ్యాధినిరోధ‌క శ‌క్తి ప్ర‌భావం త‌గ్గిన‌ప్పుడు మ‌నం ప‌రీక్ష చేయించుకుంటే అది పాజిటివ్‌గా చూపిస్తుంది. క‌రోనా పాజిటివే అని అనుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఆహారం స‌రిగా తీసుకోన‌ప్పుడు, శ‌రీరం బ‌లం కోల్పోయి బ‌ల‌హీన‌ప‌డిన‌ప్పుడు నెగెటివా?  పాజిటివా? అని ప‌రీక్ష చేయించుకుంటే పాజిటివ్ అని వ‌స్తుంది. కొవిడ్ మ‌హ‌మ్మారి ప్ర‌బ‌లుతున్న స‌మ‌యంలో చాలామందికి ఎటువంటి ల‌క్ష‌ణాలు లేక‌పోయినా ప‌రీక్షలో పాజిటివ్ అని తేలుతోంది. అందుకే శ‌రీరంలో వ్యాధినిరోధ‌క‌శ‌క్తి త‌గ్గ‌కుండా చూసుకోవాలి.

వేడినీరే దివ్యౌష‌ధం!
ఒక‌వేళ క‌రోనా పాజిటివ్ అని తేలితే స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నాం. చాలా ఔష‌ధ దుకాణాల్లో క‌రోనా మెడిక‌ల్ కిట్ పేరుతో 14 రోజుల‌కు స‌రిప‌డా ఔష‌ధాల‌ను అమ్ముతున్నారు. అవి తెచ్చుకొని వాడితేచాలు. కాక‌పోతే ఐదురోజుల‌కోసారి ర‌క్తంలో ఏమైనాఇన్‌ఫెక్ష‌న్ ఉందా? అనే కోణంలో ర‌క్త‌ప‌రీక్ష చేయించుకుంటుండాలి. క‌రోనా సోకిన త‌ర్వాత 5 నుంచి 9వ రోజు వ‌ర‌కు కీల‌కం. వైర‌స్ నెమ్మ‌దిస్తుందా? ఉధృత‌మ‌వుతుందా? అనేది ఈ నాలుగురోజుల్లోనే ఒక స్ప‌ష్ట‌త వ‌స్తుంది. విట‌మిన్ సి, విట‌మిన్ డి, జింక్ మాత్ర‌ల‌తోపాటు మ‌ల్టీ విట‌మిన్ మాత్ర ప్ర‌తిరోజు తీసుకోవాలి. వీటితోపాటు జ్వ‌రానికి ఒక మాత్ర‌, యాంటీ బ‌యోటిక్ మాత్ర‌తోపాటు శ‌రీరంలో ఉండే ఫ్లూ ను నిరోధించే మాత్ర‌ల‌ను తీసుకోవాలి. మ‌న శ‌రీరంలో ఎంత వేడి ఉంటే అంత త్వ‌ర‌గా వైర‌స్ ను నిర్మూలించ‌వ‌చ్చు. అందుకే చాలామంది కోడిమాంసం తీసుకుంటుంటారు. మూడురోజుల‌పాటు పూర్తిగా కోడిమాంసం తిని క‌రోనా నుంచి కోలుకున్న‌వారున్నారు. అన్నిటిక‌న్నా ముఖ్య‌మైంది.. వేడినీరు. ఎన్నిర‌కాల మాత్ర‌లు మ‌నం వాడుతున్నా.. ఎన్ని ఆహార‌ప‌దార్థాలు తీసుకుంటున్నా వైర‌స్ మ‌న శ‌రీరంలో ఉన్న‌న్నాళ్లు వేడినీరే దివ్యౌష‌ధంగా ప‌నిచేస్తుంది. దాహంగా ఉంటోంది.. చ‌ల్ల‌టినీరు తాగుదామ‌నే ఆలోచ‌న మానుకోవాల‌ని.. లేదంటే శ్వాస సంబంధ వ్యాధుల‌కు దారితీస్తుంద‌ని వైద్య‌నిపుణులు సూచిస్తున్నారు. 14 రోజుల వ‌ర‌కు వేడినీరే తాగాల‌ని.. అదే క‌రోనా రోగికి దివ్యౌష‌ధంగా ప‌నిచేస్తుంద‌ని చెబుతున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: