తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విషయంలో అక్కడి ప్రజల్లో ఇప్పుడు సంతోషం వ్యక్తం అవుతుంది. స్టాలిన్ తీసుకున్న నిర్ణయాల పట్ల అక్కడి ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని కొన్ని కీలక ప్రకటన చేయడమే కాకుండా కొన్ని కీలక సంతకాలు కూడా చేస్తూ ముందుకు వెళ్తున్నారు. గతంలో తన తండ్రి కరుణానిధి పరిపాలన కంటే కూడా భిన్నంగా ఆయన పరిపాలిస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

ఇటీవల కరోనా తీవ్రతకు సంబంధించి ఆయన లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక సామాన్య ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు అని భావించి కుటుంబానికి 4000 ఇస్తామని ఆయన ప్రకటన చేశారు. దీనిపై ప్రతిపక్షాలు కూడా హర్షం వ్యక్తం చేశాయి. అంతేకాకుండా అమ్మ క్యాంటీన్ విషయంలో కూడా ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్  సమయంలో కూడా పనిచేస్తాయి అంటూ ఆయన స్పష్టం చేశారు. అమ్మ క్యాంటీన్ కు సంబంధించిన బ్యానర్లను కొంతమంది డీఎంకే కార్యకర్తలు చించగా వాళ్ళ పై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు.

అలాగే కరోనా బాధితులకు సహాయం చేసేందుకు ఒక చిన్నారి సైకిల్ అమ్మి రాష్ట్ర ప్రభుత్వ సహాయ  నిధికి ఇవ్వాలి అని భావించగా ముఖ్యమంత్రి ఈ విషయం తెలుసుకుని ఆ చిన్నారి కొత్త సైకిల్ కొనిచ్చారు స్టాలిన్.  ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు. దీనితో ప్రజలలో ఆయనకు మంచి ఆదరణ వస్తుంది. భవిష్యత్తులో కూడా ఆయన ఇదే విధంగా ముందుకు వెళ్తే తమిళ రాజకీయాల్లో కచ్చితంగా మార్పు వచ్చినట్లు ఉంటుంది. ఎందుకంటే గతంలో జయలలిత, కరుణానిధి ఉన్న సమయంలో నియంతృత్వ విధానాలతో ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లే వారు. వీటి కారణంగా వ్యతిరేకత వేగంగా వచ్చేది. ఇప్పుడు స్టాలిన్ తీసుకున్న నిర్ణయాలతో ప్రజలలో సానుకూలత ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: