ప్రపంచ దేశాలకు చైనా ఎప్పటికప్పుడు ఏదో ఒక సవాల్ చేస్తూనే ఉంటుంది. అన్ని విధాలుగా కూడా చైనా మేము బలంగా ఉన్నాము అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ కొన్ని దేశాలను బలహీన పరిచే కార్యక్రమాలు కూడా ఎక్కువగానే చేస్తూ ఉంటుంది. దీనిపై చాలా దేశాలు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం చైనా ఆయుధ సామగ్రి విషయంలో కాస్త బలంగానే కనబడుతోంది. అయితే ఆ బలం నిజంగానే ఉందా లేకపోతే చైనా తయారు చేసేవి నిజంగా పని చేస్తాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

వాస్తవానికి చైనా తయారు చేసే వస్తువులు పై ప్రపంచ దేశాలపై అనేక అనుమానాలు ఉంటాయి చైనా డూప్లికేట్ వస్తువులను తయారు చేస్తూ ప్రపంచ దేశాలకు విక్రయిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయుధ సామాగ్రి విషయంలో కూడా దాదాపు ఇదే జరుగుతుంది. తాజాగా హెలికాప్టర్లను తయారుచేసింది. తాజాగా ఈ హెలికాప్టర్ యునాన్ లో కూలిపోయింది. దీంతో చైనా తయారు చేసే వస్తువులపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశం విషయంలో చైనా ఎప్పటికప్పుడు అనేక ప్రకటనలు చేస్తూ వచ్చింది.

ఇక ప్రపంచ దేశాలకు కూడా అనేక వార్నింగ్ లు ఇస్తూ వచ్చింది. కానీ నాణ్యత లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల చైనా ప్రయోగించిన రాకెట్ కూడా తిరిగి భూమి మీదకు వచ్చేసింది. దీనిపై ప్రపంచ దేశాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా అయితే వార్నింగ్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తయారు చేసిన హెలికాప్టర్ కూలిపోవడంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఏదైనా కొనుగోలు చేయాలి అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడుతోంది. నేపాల్ కు కొన్ని ఆయుధాలను అమ్మగా అవి ఎందుకు పనికి రాలేదు. ఆ తర్వాత శ్రీలంక కు కొన్ని యుద్ధ నౌకలను విక్రయించగా అవి కూడా ఎందుకు పనికి రాకపోవడంతో చైనాపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: