జగన్ సీఎం గా తొందరలోనే రెండేళ్ల పాలన పూర్తి చేసుకోబోతున్నారు. జగన్ వరకూ పాలనానుభవం బాగానే సంపాదించారు. ఆయన కనీసం మంత్రి కూడా కాకుండా సీఎం అయినా కూడా పాలనారధాన్ని బాగానే లాక్కొస్తున్నారు.

అయితే సంక్షోభ సమయల్లో పాలన ఎలా చేయాలి అన్నది ఒక సవాల్. ఈ రోజు చూస్తే దేశంలో మహామహులు కూడా ఆ విషయంలో తడబడుతున్నారు. ఈ రోజు కరోనా వైరస్ ఒక పాండమిక్ గా భారత దేశాన‌ దూసుకువచ్చింది. దానికి హద్దులు అడ్డు అదుపులూ అన్నవి కూడా ఎక్కడా లేవు. మొదటి దశ కరోనాకు రెండవ దశకూ కూడా ఎక్కడా పోలికా పొంతలా లేనే లేదు. ఇక మొదటి సారి కరోనా వచ్చినపుడు జగన్ బాగానే ఎదుర్కొన్నారు అన్న పేరు వచ్చింది. దానికి కేంద్రంలోని మోడీ సర్కార్ సహకారం కూడా ఉంది.

అయితే రెండవ దశలో కేంద్రం పూర్తిగా అన్ని బాధ్యతలను రాష్ట్రాల మీదనే వదిలేసింది. ఈ పరిణామంతో పాటు రెండవ దశలో కేసులు ఒక్కసారిగా పెరగడం, ఆక్సిజన్ పెద్ద ఎత్తున అవసరం పడడం ఇవన్నీ కూడా పెను సవాళ్లే.  జగన్ సర్కార్ ఈ విషయంలో బాగా ఫెయిల్ అవుతోంది అంటున్నారు. మరో వైపు చూస్తే జగన్ సమీక్షలు నిర్వహిస్తున్నా వాటి ఫలితాలు మాత్రం ఎక్కడా చేరడంలేదు అంటున్నారు.

అధికారుల మీద వ్యవస్థ మీద జగన్ పట్టు సాధించలేదా అన్న దౌట్లు కూడా కలుగుతున్నాయి. ఇక ఒక సంక్షోభం వచ్చినపుడు దానిని సరిగ్గా హ్యాండిల్ చేయాలి. అన్ని వైపుల నుంచి పరిష్కారం చూసుకోవాలి. ఈ విషయంలో చూసుకుంటే జగన్ తడబడుతున్నారనే చెప్పాలి. బహుశా అందుకేనేమో టీడీపీకి చెందిన మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి జగన్ కి క్రైసిస్ మేనేజ్ మెంట్ లో అనుభవం లేదని హాట్ కామెంట్స్ చేశారు. సరే ఏ సంక్షోభం అయినా ఎవరికీ  చెప్పి రాదు,  వచ్చిన తరువాతనే దాన్ని ఎదుర్కోవాలి. ఇప్పటికైనా జగన్ సర్కార్ అధికారుల తో పనిచేయించుకోవడంతో పాటు స్వయంగా మోనిటరింగ్ చేయాలని కూడా సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: