ఇప్పుడు తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏపీ మంత్రి సీదిరి అప్పల్రాజును అడ్డం పెట్టుకుని చంద్రబాబు గారు ఒకరకంగా సేవ్ అయ్యారు అని చెప్పవచ్చు. ఈ మధ్యన చంద్రబాబు ఒక వెబినార్ లో మాట్లాడుతూ వైజాగ్ మరియు కర్నూల్ జిల్లాలలో కొత్త వేరియంట్ కనబడింది. ఇది వైరస్ 15 రెట్లు ప్రమాదకరంగా మారుతోందని చెప్పడం జరిగింది. దీనిపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అంతే కాకుండా చంద్రబాబు ఒక 420 వైరస్ అని ఘోరాతి ఘోరంగా విమర్శించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్నూల్ వైసీపీ కి చెందిన లీగల్ సెల్ లాయర్ ఒకరు దీనిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది.

ఈ ఎఫ్ ఐ ఆర్ కూడా పాండమిక్ యాక్ట్ కింద పెట్టడం జరిగింది. దీనికి అర్ధం ఏమిటంటే చంద్రబాబు లేనిపోనివి చెప్పి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని చెప్పడం అని మాట. కానీ దీనికి టీడీపీ నాయకులు చెప్పిన సమాధానం చూస్తే, "ఈ వార్త మేము కావాలని చెప్పింది కాదు..ఇప్పటికే జాతీయ పత్రికలలోనూ ఈ విషయం గురించి చెప్పారు". కాబట్టి మేము చెప్పడం జరిగిందని వారు వివరణ ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం వినకుండా అటువంటి వైరస్ ఏదీ లేదని ఆరోపణలు చేశారు. అయితే సాధారణంగా ఎఫ్ఐఆర్ కట్టిన తరువాత విచారణ నిమిత్తం నోటీసు ఇవ్వాలి. ఎస్ ఐ ఫకీరప్ప నోటీసు ఇస్తామని కూడా ప్రకటించారు.

ఇందులో భాగంగానే ఫకీరప్ప నోటీసు ఇవ్వడానికి హైదరాబద్ వరకు వెళ్లారు. కానీ అంతలోనే మంత్రి సీదిరి అప్పలరాజు ఒక టీవీ డిబేట్ లో భాగంగా ఇదే వైరస్ గురించి ప్రస్తావించడంతో మంత్రిపై కూడా కేసు నమోదు చేయాలని కర్నూల్ టీడీపీ నాయకుడు ఫిర్యాదు చేశారు.  ఆ తర్వాత హైద్రాబాద్ వరకు వెళ్లిన ఫకీరప్ప బృందం వెనక్కు తిరిగి వచ్చేశారు. ఇక్కడ జరిగిన కథలో చంద్రబాబు ను ఒక విధంగా సీదిరి అప్పలరాజు కాపాడారని అనుకుంటున్నారు. ఈ కేసులో మరి ఏమి జరగనుందో తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: