ప్రస్తుతం దేశం మొత్తం కరోనా విలయతాండవం చేస్తూ మారణహోమం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే రోజురోజుకు వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య మాత్రం అంతకంతకూ పెరిగిపోతోంది మొదటి రకం కరోనా వైరస్ తో పోల్చి చూస్తే రెండవరకం కరోనా వైరస్ దారుణంగా విజృంభిస్తుంది అనే చెప్పాలి. అంతేకాదు మనుషుల్లో ముందుగా ధైర్యాన్ని చంపేసి ఆ తర్వాత మనుషుల ప్రాణాలు తీస్తుంది ఈ మహమ్మారి వైరస్.



 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో దేశంలో రోజురోజుకు విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావడంతో పాటు ఆయా రాష్ట్రాల పరిధిలో లాక్‌డౌన్‌ విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి అనే విషయం తెలిసిందే. కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కరోనా వైరస్ ను కంట్రోల్లోకి తెచ్చేందుకు లాక్డౌన్ ఒక్కటే మార్గం అని భావించిన ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నాయి.  ఇకపోతే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది కనీసం అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా స్థలం లేకపోవడంతో ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.



 ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే ఇటీవలే యమునా గంగానదిలో కొన్ని మృతదేహాలు కనిపించడం సంచలనం గా మారిపోయింది అయితే గంగానదిలో కుప్పలు కుప్పలుగా మృతదేహాలు కొట్టుకొచ్చిన వ్యవహారంపై ఇటీవలే బీహార్ ప్రభుత్వం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కుప్పలు కుప్పలుగా వచ్చిన మృతదేహాలు అన్నీ కూడా నీటి ప్రవాహం ద్వారా ఉత్తరప్రదేశ్ నుంచి తమ రాష్ట్రానికి చేరాయి అంటూ బీహార్ ప్రభుత్వం తెలిపింది. బక్సర్ జిల్లాలో గంగా తీరం వెంబడి 17 మృతదేహాలను వెలికి తీశాము అంటూ అధికారులు తెలిపారు  ఇక ఆ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియలు కూడా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఆ మృతదేహాలన్ని కరోనా బాధితుల వే అంటూ చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: