తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. అయితే వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న ప్రభుత్వం మాత్రం సరైన చర్యలు తీసుకోవడం లేదు అన్న విమర్శలు కూడా వస్తున్నాయ్. ప్రస్తుతం మాత్రమే కాదు గత ఏడాది నుంచి కూడా కరోనా వైరస్ పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడం లేదు అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి కూడా కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న  సమయంలో అటు వైరస్ రోగులకు ఆస్పత్రిలో సరైన సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది అని విమర్శలు వస్తున్నాయి.



 ప్రస్తుతం పేద మధ్యతరగతి ప్రజలు కరోనా వైరస్ కారణంగా దుర్భర స్థితిలో పడిపోతున్నారు. అదే సమయంలో కరోనా వైరస్ చికిత్సను ఉచితం చేస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు కార్పొరేట్ ఆసుపత్రులు ఫీజులు వసూలు చేస్తున్న సమయంలో అటు పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇక ఇప్పటికే ఏపీ సహా పలు రాష్ట్రాలలో చేసిన విధంగానే కరోనా వైరస్ చికిత్స ఉచితం చేస్తూ నిర్ణయం తీసుకోవాలి అని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో చేసినట్లుగానే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.


 ఇక తాజాగా ఇదే విషయంపై వైయస్ షర్మిల కేసిఆర్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ లో కెసిఆర్ లాక్‌డౌన్‌ విధించడంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన షర్మిల.. అయ్య పెట్టడు అడుక్కుతిననివ్వడు.. అలాగే కెసిఆర్ కరోనా వైరస్ చికిత్స ను ఆరోగ్యశ్రీలో చేర్చడు.. ఆయుష్మాన్ భారత్ లో చేరడు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైయస్ షర్మిల కేసీఆర్ సారు ఇప్పటికైనా సోయిలకిరా అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇప్పటికైనా సర్కారు దవాఖానాలు సక్కగ చేసి కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చు అంటూ విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: