ఆంధ్రప్రదేశ్ లో ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్లాలి అంటే కొన్ని అంశాలను కాస్త జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబునాయుడు కొన్ని అంశాలను టార్గెట్ చేసే విషయంలో ప్రజల్లోకి వెళ్లే విధంగా విమర్శలు చేయాల్సి ఉంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం  వ్యాక్సిన్ కి సంబంధించి సమర్థవంతంగా వ్యవహరించడం లేదు అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతుంది. కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఒక ప్రణాళిక లేదు అనే విషయం కూడా అందరికీ అర్థమవుతుంది.

ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యాక్సిన్ కి సంబంధించి ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించే విషయంలో విఫలమవుతున్నారు అనే భావన చాలా వరకు కూడా ఉంది. తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలామంది నాయకులు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం 1600 కోట్లు ఖర్చు చేసి ప్రజలకు అందించాలని భావించింది. కానీ ఈ విషయంలో ఏ అడుగు కూడా పడకపోవడంతో ఇప్పుడు కాస్త అనేక అనుమానాలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే కలిగితే మాత్రం మంచి ఫలితం ఉండొచ్చు. అన్ని రాష్ట్రాలు వాక్సిన్ కి సంబంధించి తయారీ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం లేఖలు రాసి సమయం వృధా చేసినది అనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం ప్రధానమంత్రికి లేఖ రాయడం ద్వారా వచ్చే అవకాశం లేదని డబ్బులు చెల్లిస్తే మాత్రమే వ్యాక్సిన్ తయారీ సంస్థలు వ్యాక్సిన్ పంపించే అవకాశం ఉంటుంది అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని ప్రజల్లోకి ఎంత వరకు బలంగా తీసుకువెళుతుంది ప్రజల్లోకి తీసుకువెళ్లి వాస్తవాలు ఎలా వివరిస్తుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: