దేశంలో కరోనా వైరస్ ఉదృతి కారణంగా అన్ని రాష్ట్రాలు ఒకదాని తరువాత మరొకటి కరోనా నియంత్రణ చర్యల్లో బాగంగా కర్ఫ్యూ విధించుకుంటూ పోతున్నాయి. ఇటీవలే ఆంధ్ర రాష్ట్రం కూడా పెరుగుతున్న కరోనా కేసుల దృష్యా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు ప్రజలకు, వ్యాపారాలకు, నిత్య అవసరాలకు అనుమతులు ఇచ్చి 12 నుండి ఇక ఎవరూ రోడ్లపైకి రాకూడదని కర్ఫ్యూ విధించింది. కాగా పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం మాత్రం కర్ఫ్యూ పెట్టకపోవడంతో ఇంకా చలించలేదంటూ, ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదా అంటూ పలు విమర్శలు ఎదుర్కొంది. అయితేనేం తెలంగాణ సర్కారు సైతం తమ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది.

నేటి నుండి అనగా మే 12 ఉదయం 10 వరకు ప్రజలకు , నిత్యవసర సరుకుల షాపులకు పర్మిషన్ ఇచ్చింది. 10 తర్వాత కర్ఫ్యూ అని ఎవరూ బయటకు రావడానికి వీలు లేదని స్పష్టం చేసింది. అయితే తెలంగాణ ప్రజలు ఇది ఊహించనేలేదు. ప్రభుత్వం మౌనంగా ఉండడంతో తమ రాష్ట్రంలో కర్ఫ్యూ ఉండబోదేమోనని అంచనా వేయగా, ఇప్పుడది తలకిందులైంది. దాంతో ప్రజలు ఉన్నట్టుండి కర్ఫ్యూ అంటే కాస్త కంగారు పడుతున్నారు. కొందరు నిత్యవసర వస్తువుల కోసం పరుగులు తీస్తుంటే మరికొందరు 10 గంటల తర్వాత ఎలా కాలక్షేపం చేయాలని ఆలోచించి కొన్ని ఆట వస్తువులను కొనడానికి పరుగులు తీస్తున్నారు. మరికొందరు ఈ టైం లో యూట్యూబ్ లో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను చూడడానికి సిద్దం అయ్యారు.

మరికొందరు రకరకాల బుక్స్ ని కొనేందుకు ఆసక్తి కనబుస్తున్నారు ఇలా కర్ఫ్యూ సమయంలో ఎలా కాలక్షేపం చేయాలి అని ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో కర్ఫ్యూ ఏ స్థాయిలో కరోనా వైరస్ పై ప్రభావం చూపుతుందో చూడాలి. ప్రజలు అందుకు ఖచ్చితంగా కట్టుబడి తమ ప్రాణాలను తమ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవించి సహకరించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: