తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక మొదటి నుంచీ పలు కీలక చర్యలు చేపడుతూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే నైట్ కర్ఫ్యూ  విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ అటు ఎక్కడ కరోనా కేసుల సంఖ్య మాత్రం తగ్గినట్లుగా అనిపించలేదు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో విపత్కర పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది అని భావించిన తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ విషయంలో ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ మంత్రులతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించిన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ  నిర్ణయం తీసుకున్నారు



 అయితే అప్పటి వరకు అసలు తెలంగాణలో లాక్ అనేదే ఉండదు అని చెప్పిన ప్రభుత్వం ఒక్కసారిగా పది రోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకోవడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ముందుగా మందుబాబులు అయితే ఇక అప్రమత్తం అయిపోయారు  మొన్నటివరకు వ్యాక్సిన్ కేంద్రాలకు పరిగెత్తిన జనాలు ఇక ఇప్పుడు వైన్స్ లకు పరుగులు పెడుతున్నారు. లాక్ డౌన్ ప్రకటించడంతో ఎంతో మంది మద్యం షాపుల దగ్గరికి బారులుతీరారు. ఏ మద్యం షాపు దగ్గర చూసిన కుప్పలుతెప్పలుగా జనాలు కనిపించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మందుబాబుల ముందు చూపుకి నిదర్శనంగా ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.



 ఇటీవలే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది లేదో మద్యం షాపుల వద్ద పోటెత్తారు మందుబాబులు. దీంతో హైదరాబాద్ సహా చాలా పట్టణాల్లో కొన్ని నిమిషాల్లోనే మద్యం షాపులు సందడిగా  మారిపోయాయి.  చివరికి కొన్ని షాపుల వద్ద పోలీసులు స్వయంగా రద్దీ పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మందుబాబుల దెబ్బకి హైదరాబాద్లోని ఒక వైన్ షాప్ లో పూర్తిగా మద్యం ఖాళీ అయిపోయింది దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారి పోయింది. ఇక ఇది చూసిన ఎంతో మంది నెటిజన్లు ముందుచూపు అంటే ఇదే మరి అంటూ ఎంతో కామెంట్లు పెడుతున్నారు https://youtu.be/d81xoOWhd80

మరింత సమాచారం తెలుసుకోండి: