తెలంగాణలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కి సంబంధించి ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈటెల రాజేందర్ విషయంలో సీఎం కేసీఆర్ ఏ విధంగా ముందుకు వెళ్తారు...  ఈటెల రాజేందర్పార్టీ లోకి వెళ్తారు ఏంటనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆయనకు ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. భారతీయ జనతాపార్టీ కూడా ఈ విషయంలో కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్తున్న సంగతి అర్థమవుతుంది.

బీసీ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో ఆయనకు ఇతర సామాజిక వర్గాల్లో కూడా మంచి పట్టు ఉండే అవకాశం ఉంది. ఇతర పార్టీలన్నీ కూడా ఇప్పుడు ఆయనను ఆదరించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి కూడా సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈటెల రాజేంద్ర కాంగ్రెస్ పార్టీలో కి వెళ్తారా లేదా అనే దానిపై స్పష్టత రావడం లేదు. కానీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించటమే కాకుండా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే కచ్చితంగా పార్టీ మారే అవకాశాలు ఉంటాయి అని కొంతమంది అభిప్రాయం.

రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపించే విషయంలో సీఎం కేసీఆర్ సమర్థవంతంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయనను ఎదుర్కోవాలి అంటే ఇప్పుడు ఈటెల రాజేంద్ర సరైన నాయకుడు అనే భావనలో టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కొందరు ఉన్నారు. ఎందుకు అంటే... టిఆర్ఎస్ పార్టీలో కొంతమందికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు  ఈటెల రాజేందర్ వేరే పార్టీ లోకి వెళ్లి పైకి రావాలి అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు గా కూడా స్పష్టంగా అర్థం అవుతుంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: