రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంపై విమర్శల వర్షం కురుస్తోంది. రాష్ట్రంలోని కేజీ బేసిన్ గ్యాస్ విషయంలో ప్రభుత్వం ఎందుకు చేతులు ముడుచుకు కూర్చుందని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. అయితే కేజీ గ్యాస్ డీ6 బ్లాక్‌లోని కొత్త నిక్షేపాల నుంచి రోజుకు దాదాపు 5.5 మిలియన్ల ప్రామాణిక గణపు మీటర్ల గ్యాస్ అదనంగా ఉత్పత్తి అవుతుంది. దీంతో బ్లాక్ ఆపరేటర్లు రిలయన్స్ దాని భాగస్వామ్య సంస్థ బీజీ వేలం వేశాయి.

ఈ వేలంలో పాల్గొన్న రిలియన్స్ సంస్థ ఆయిల్‌ టు కెమికల్ (ఓటీసీ) 3.2 ఎమ్‌సీడీలు సొంతం చేసుకోగా రిలియన్స్, బీపీ జాయింట్ వెంచర్ సంస్థ ఇండియా గ్యాస్ సొల్యూషన్ (ఐఎస్) 1 ఎమ్‌సీడీను దక్కించుకుంది. అయితే నిర్దేశిత ఫార్ములా ప్రకారం ఒక్క యూనిట్ దాదాపు 9 నుంచి 8 డాలర్ల ధర పలుకుతుంది. కానీ కేంద్రం విధించిన పరిమితుల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి సెప్టెంటర్ 31 వరకు యూనిట్‌ను 3.2 డాలర్లకే అమ్మవలసి ఉంది. దీంతో కొనుగోలు దారులు ఎక్కువ ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ తక్కువ ధరకే అమ్మవలసి వచ్చింది.

 దీని కారణంగా కొనుగోలు చేసిన వారికి గిట్టుబాటు అయినప్పటికీ ఉత్పత్తి దారులకు నష్టం చేకూరుతుంది. అంతేకాకుండా దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు కూడా కొన్ని మిలియన్ల నష్టం వస్తుందని అధికారులు అంటున్నారు. అయితే ఈ వేలం కార్యక్రమాలన్నీ కూడా కేంద్రం నేతృత్వంలో జరుగుతాయి. గత కాలంలో తెలుగుదేశం పార్టీ వారు అధికారంలో ఉన్నప్పుడు అంబానీలకిి బిడ్డింగ్ కట్టబెట్టడంతో ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ అధికార పక్షం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బిడ్ వేయలేదని ప్రశ్నించారు.

 అంతేకాకుండా చంద్రబాబు నాయుడు అంబానీలకు అమ్ము పోయాడంటూ విమర్శలు చేశారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ అధికారంలోకి వచ్చినప్పుడు బిడ్ వేసినా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బిడ్ దక్కలేదు. అయితే ఈ సారి అత్యంత తక్కువ ధరకు వస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని, సీఎం జగన్ బిడ్ వేయకుండా మళ్లీ అంబానీలకు ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి ప్రభుత్వం ఏమని సమాధానం ఇస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: