దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ విషయంలో భారతీయ జనతా పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏ పార్టీకి పనిచేస్తారు ఏంటి అనే దానిపై స్పష్టత రావడం లేదు. అయితే ఆయన ఏ పార్టీ కోసం కూడా తన పని చేసేది లేదని స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడిగా మారే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. ఒకవేళ ఆయన రాజకీయ నాయకుడిగా మారితే పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకుంటాయి... ఆయన ఎవరిని టార్గెట్ చేస్తారు అనే దానిపైనే చర్చలు కూడా జరుగుతున్నాయి.

ప్రస్తుతం భారతీయ జనతా పార్టీని ఎలా అయినాసరే అధికారం నుంచి దించాలి అని అన్ని పార్టీలు కూడా పట్టుదలగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనుసరించిన వైఖరే దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ విషయంలో చాలా రాజకీయ పార్టీలు సీరియస్ గా ముందుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రధానంగా తమిళనాడులో స్టాలిన్ తో ప్రశాంత్ కిషోర్ తో కలిసి ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే మరో మూడు పార్టీలు కూడా ప్రశాంత్ కిషోర్ సహాయ సహకారాలు తీసుకునే ఆలోచన ఉన్నాయి అనే వార్తలు కూడా ఎక్కువగానే వినబడుతున్నాయి.

ప్రశాంత్ కిషోర్ తో సన్నిహితంగా ఉండే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పని చేయాలని కోరుతున్నారు. అలాగే సమాజ్వాది పార్టీ కూడా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సహకారం తీసుకునే అవకాశముందని సమాచారం. హర్యానాలో ఒక పార్టీ పంజాబ్ లో కూడా ఒక పార్టీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తో మాట్లాడుతున్నాయని రాజకీయవర్గాలు అంటున్నాయి. ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీని గెలిపించిన తర్వాత ఆయన డిమాండ్ భారీగా పెరుగుతోంది. మరి ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తారు ఏంటీ అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: