కరోనా వైరస్ కి కనికరం అనేది లేదు. పిల్లలు, పెద్దలు, ముసలి, ముతక అనే తారతమ్యం లేకుండా అందరిని పట్టి పీడిస్తూ వస్తుంది. పెద్దల మాట దేవుడెరుగు పిల్లల పరిస్థితి గురించి ఆలోచిస్తే మాత్రం కడుపు తరుక్కుపోతుంది కదా. ఇప్పుడు ఈ మహమ్మారి రూపాంతరం చెంది రెండవ దశలో పిల్లల్ని కూడా వదలడం లేదు. కరోనా వైరస్ బారినపడి పిల్లలు సైతం నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పెద్దలకు అయితే వాక్సిన్ అందుబాటులోకి వచ్చింది కానీ పిల్లలకు మాత్రం ఇంకా వాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలోనే పిల్లలలకు కూడా కరోనా వైరస్ సోకుతోందని గ్రహించిన  భారత్ బయో టెక్ సంస్థ ఒక  వినూత్న ఆలోచన చేసింది. తమ సంస్థ తయారుచేసే కోవాగ్జిన్ వాక్సిన్ ను 2 నుంచి 18 ఏజ్ గ్రూప్ వారికి కూడా ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేసింది. అందుకే 2 నుంచి 18 ఏళ్లలోపు వయసు గల పిల్లలకు కూడా  తమ కోవాక్సిన్ టీకామందు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి 2, 3 దశల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు కూడా రెడీ అయిపోయిందట. అందుకనే తమ అభ్యర్థనను  నిపుణుల కమిటీ దృష్టికి తేగా ఆ కమిటీ కూడా ఆ సంస్థ అభ్యర్థనను సమరస్యంగానే ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.


సెంట్రల్ డ్రగ్స్ ఆఫ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ నిన్న ఈ ప్రతిపాదనపై లోతుగా చర్చలు కూడా జరిపింది. అంతేకాదు ఢిల్లీ లోని ఎయిమ్స్, పాట్నా లోని ఎయిమ్స్, నాగపూర్ లోని మెడిట్రినా ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తో బాటు 525 చోట్ల ఈ రెండు, మూడో దశ ట్రయల్స్ నిర్వహించేందుకు ఒప్పుకున్నారు కూడా.  2 నుంచి 18 ఏళ్ళ లోపు వయస్సు వారిపై తమ ట్రయల్స్ నిర్వహణకు  అనుమతినివ్వాలని భారత్ బయోటెక్ పెట్టుకున్న దరఖాస్తుపై ఈ కమిటీ కూలంకషంగా చర్చించి ఈ మేరకు సిఫారసు జారీ చేసినట్లు తెలుస్తోంది.



అయితే ఇక్కడే పెద్ద చిక్కువచ్చి పడింది.అసలే పిల్లలు కదా సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ట్రయల్స్ నిర్వహిస్తే వాళ్ళకి ఏమన్నా అవుతుందేమో అనే అనుమానులు వ్యక్తం అవుతున్నాయి.అందుకనే  ఈ పరీక్షల్లో పిల్లల ఆరోగ్యానికి మొదటగా ప్రాముఖ్యత ఇవ్వాలని నిపుణుల బృందం ఈ కంపెనీని కోరింది. అసలు పిల్లలపై ట్రయల్స్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని కంపెనీని ప్రశ్నించింది. ఈ క్రమంలో మొదట భద్రత, సురక్షిత అంశాలకు సంబంధించి హామీ ఇవ్వాలని సూచించింది. గత ఫిబ్రవరి 24 న జరిగిన ఓ సమావేశంలో దీని గురించి చర్చించి క్లినికల్ ట్రయల్ ప్రోటోకాల్ ని సమర్పించాలని భారత్ బయోటెక్ సంస్థను కమిటీ కోరింది. పిలలపై ఈ ట్రయల్స్ విజయవంతం అయితే పిలల్లకు కూడా వాక్సిన్ అందుబాటులోకి వస్తుంది.. !


మరింత సమాచారం తెలుసుకోండి: