మన దేశంలో ఏదైనా కొత్త వస్తువు తయారయింది అంటే చాలు దాని కంటే ఎంతో వేగంగా ఆ వస్తువుకు కల్తీ కూడా తయారయి పోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఉప్పు పప్పు నీరు మద్యం ఇలా అన్నిట్లో కూడా కల్తీ జరుగటం చూసుంటారు. ఇక ఇప్పుడు కరోనా వైరస్ రోగులకు ఇచ్చే వ్యాక్సిన్ విషయంలో కూడా కల్తీ జరుగుతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది వ్యాక్సిన్ పేరుతో ఎంతోమందిని బురిడీ కొట్టిస్తున్నారు  మరికొంతమంది ఇక కల్తీ వ్యాక్సిన్ పాల్పడుతున్న ఘటనలు కూడా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.



 ఈ మధ్యకాలంలో వాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఎంతోమంది వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే పేద మధ్యతరగతి ప్రజల పరిస్థితులు అర్థం చేసుకోకుండా ఏకంగా డబ్బులు వసూలు చేస్తూ  ఉన్నారు. ఇలాంటి ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది వీధిలో వైద్యుడు ఒక డోసు 600 వసూలు చేసి కొంతమందికి కారులో పెట్టి అందిస్తున్న ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది స్థానిక కార్పొరేటర్ మూర్తి దృష్టికి ఈ విషయం రావడంతో నేరుగా ఆయన డాక్టర్ నిలదీశారు



 ఈ విషయం బయటికి పొక్కడంతో ఆ నోటా ఈ నోటా పడి స్థానిక కార్పొరేటర్ దృష్టికి వచ్చింది ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఆమె నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్లి నిలదీశారు  దీంతో ఎలాంటి సమాధానం చెప్పకుండానే అక్కడినుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఇక పోలీసులు తమ వాహనాలతో నిందితులను వెంబడించి పట్టుకున్నారు ఇక వారి దగ్గర తనిఖీ చేయగా కొన్ని రకాల వ్యాక్సిన్లు బయటపడ్డాయి. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.అయితే ఈ మధ్య కాలంలో ఇలా ఎంతో మంది వ్యాక్సిన్ విషయంలో అక్రమాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇక ఇలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తే బాగుంటుంది అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: