కరోనా వైరస్.. ఈ పేరెత్తితే చాలు జనాలు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.. రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతూ ఉండడం  అందరిలో ప్రాణ భయాన్ని కలిగిస్తుంది.  అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ నియంత్రణపై ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వ్యాధి కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది రోజురోజుకు దేశంలో పరిస్థితులు మరింత అధ్వానంగా మారిపోతున్నాయి. అయితే దేశంలో పరిస్థితులు చూస్తూ ఉంటే కరోనా వైరస్ పై పూర్తి అవగాహన ఉన్న వారికి సైతం భయాందోళనలు పుట్టుకొస్తున్నాయి.



 ఈ క్రమంలోనే ఎంతోమంది కరోనా వైరస్ పై అవగాహన కల్పించినప్పటికీ విద్యావంతులు అయినప్పటికీ కూడా వైరస్ సోకింది అనే భయంతో ఇక తమ జీవితంలో  అయిపోయింది అని భావించి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు అందరిని మరింత ఆందోళనలో ముంచెత్తుతున్న ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే తెలంగాణలోని ఇబ్రహీంపట్నంలో 50 ఏళ్ల మహిళకు కరోనా వైరస్ సోకింది ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురయ్యింది.  ఇక మనసులో కుంగిపోయి ఇక ఈ జీవితం వృధా అని అనుకొని చివరికి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.



 ఇబ్రహీంపట్నం కి చెందిన కుమారి అనే 50 ఏళ్ల మహిళ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది భర్త నాలుగు సంవత్సరాల కిందటే మృతి చెందడంతో ఇంటి బాధ్యత తానే తీసుకొని కుటుంబాన్ని ముందుకు నడిపిస్తుంది అయితే నాలుగు రోజుల కిందట జ్వరం రావడంతో ఆసుపత్రికి వెళ్ళి పరీక్ష చేయించుకు ఒక పాజిటివ్ అని తేలింది ఈ విషయాన్ని తెలియజేశారు పూట గడిపేందుకు కష్టంగా ఉన్న పరిస్థితుల్లో కరోనా వైరస్ వచ్చి ఇంట్లో ఉండాలి అంటే మరిన్ని కష్టాలు వచ్చి పడతాయి అని ఆమె భావించింది చివరికి తన బిడ్డలకు భారం కాకూడదు అని నిర్ణయించుకుని కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది ఇక బంధువులు కుటుంబ సభ్యులు కాపాడేందుకు ప్రయత్నించిన ఉపయోగం లేకుండా పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: