కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకు పెరిగిపోతోంది  కేసుల సంఖ్య అంతకంతకూ ఎక్కువవుతోంది. దేశంలో పరిస్థితులు చూస్తుంటే ప్రమాదకరంగా మారిపోతున్నాయి. ఇక సగటు జీవితానికి అసలు గ్యారెంటీ లేకుండా పోయింది. ఏ క్షణంలో చస్తామో అన్న భయం అందరిలో నెలకొంది  రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులతో ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి లు వస్తున్నాయి.  కేవలం దేశంలోని ఒక రాష్ట్రంలో కాదు దేశాన్ని మొత్తం కరోనా వైరస్ నీడలు కమ్ముకున్నాయి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ మాత్రం విపరీతంగా పెరిగి పోతూనే ఉంది.



సామాన్యులు సెలబ్రెటీలు ప్రజాప్రతినిధులు అధికారులు అనే తేడా లేకుండా అందరి పై పంజా విసురుతోంది ఈ మహమ్మారి. ఇక ఇప్పుడు అడవిలో బతికే అన్నల పై కూడా ఈ మహమ్మారి కన్నేసినట్లు తెలుస్తోంది. అడవిలో ఉండే  మావోయిస్టులు సైతం కరోనా వైరస్ బారిన పడుతూ చివరికి ప్రాణాలు కోల్పోతున్నట్లు సమాచారం ఇప్పుడిప్పుడే బయటికి వస్తుంది. ఇటీవలే సైన్యంపై మావోయిస్టులు దాడి చేసి ఏకంగా ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు. అయితే ఇక ఇప్పుడు సైన్యం కంటే ఎక్కువ ఆ మావోయిస్టులను  వైరస్ వెంటాడుతుంది అన్నది అర్ధమవుతుంది.




 అడవి తల్లి ఒడిలో ఉన్న తమకు కరోనా వైరస్ రాదు అని భావించిన అన్న లపై విజృంభిస్తుంది కరోనా వైరస్. ఇప్పుడు వరకు కరోనా వైరస్ బారినపడి పరిస్థితి విషమించి ఏకంగా 10 మంది మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది. ఇటీవలె అభిషేక్  అనే ఎస్పీ ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా 25 మంది వరకు ఇప్పటికే కరోనా వైరస్ బారినపడి తీవ్రమైన అనారోగ్యంతో బాధ పడుతున్నారు అన్న విషయం కూడా ఆయన చెప్పుకొచ్చారు.  ఈ క్రమంలోనే ఎవరైతే కరోనా వైరస్ బారిన పడ్డారు వారు స్వచ్ఛందంగా లొంగిపోతే వారికి కరోనా వైరస్ చికిత్స ఇప్పిస్తాము అంటూ అక్కడి ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇక దీనిపై అటు మావోయిస్టులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: