ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తోంది.  గత ఏడాది వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి  మధ్యలో కాస్త తగ్గినట్టు అనిపించినప్పటికీ ఇక ఇప్పుడు రెండవ దశ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ అందరిని బెంబేలెత్తిస్తోంది  రోజురోజుకు వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది   వెరసి పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయ్. అయితే మొదటి రకం కరోనా వైరస్ తో పోల్చి చూస్తే రెండవరకం  వైరస్ ఎక్కువగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఎంతో మంది ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలతో బాధపడుతున్నారు ఈ క్రమంలోనే ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు కరోనా వైరస్ రోగులు.



ఇక రోజు రోజుకు ఆసుపత్రులకు వెళ్తున్న కరోనా వైరస్ రోగుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో కూడా ఆక్సిజన్ కొరకు ఏర్పడుతున్న పరిస్థితులు వస్తున్నాయ్. ఈ నేపథ్యంలోనే ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు ఇలాంటి నేపథ్యంలో దేశంలో ఏర్పడిన ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు ఎంతో మంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సైతం ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తున్నారు.  అయితే కరోనా వైరస్ కష్టకాలంలో మొదటి నుంచి ఎంతో మంది ప్రజలను ఆదుకుంటూ ఆపద్బాంధవుడిగా మారిపోయిన సోను సూద్ ప్రస్తుత సమయంలో కూడా మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు.



 ఇప్పటికే ఆక్సిజన్ అందక ఆసుపత్రులలో ఎంతోమంది కరోనా వైరస్ వల్ల మృత్యువాత పడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో సోను ఒక గొప్ప ఆలోచన కు శ్రీకారం చుట్టారు. సిలిండర్లు ఆక్సీజన్ సరఫరా మాత్రమే కాకుండా రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్ నెలకొల్పాలని డిసైడయ్యారు సోనుసూద్. దీని కోసం ఫ్రాన్స్ నుంచి సామాగ్రిని తీసుకురానున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా ఇతర దేశాల నుంచి వివిధ రకాల పరికరాలను కూడా దిగుమతి చేసుకోవాలని నిర్ణయించారు. మరో రెండు వారాల్లో  కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు సూచించిన రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు సత్వరమే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: