కరోనా సోకిన వ్యక్తి ఇంట్లో ఉండడం ద్వారా మాత్రమే నయమవుతారని ఇప్పుడు ప్రపంచం మొత్తం విశ్వసిస్తోంది. అతనికి ఆక్సిజన్ లేదా ఆసుపత్రి అవసరం లేదు. కరోనా సోకినవారు సాధారణంగా 14 నుండి 17 రోజులు ఇంటి ఒంటరిగా ఉండాలని సూచించారు. కానీ ఇవన్నీ లక్షణాల స్వభావం మరియు వాటి తీవ్రత ద్వారా నిర్ణయించబడతాయి. అయితే, లక్షణాలు ఎక్కువ ఉంటె కనీసం 14 రోజులు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. సంక్రమణ లక్షణాలు లేని వ్యక్తులు వైరస్ పాజిటివ్ అని పరీక్షించిన 10 రోజుల తర్వాత వారి హోం ఐసోలేషన్ ముగుస్తుంది. హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నవారు తప్పనిసరిగా కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఇంటి దగ్గరే ఉంటూ కరోనాకు చికిత్స తీసుకుంటున్నవారు ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయాలపై వైద్య నిపుణులు పలు సూచనలు ఇస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు ఇవి చేయడం ద్వారా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ముందుగా గాలి, వెలుతురు ఉండే రూమ్‌లో ఒంటరిగా ఉండాలి. చేతులను తరచూ శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడూ మాస్క్ ధరించాలి. ఇంట్లోనే ఉన్నాం కదా అని మాస్కు ధరించడంలో పొరపాటు చేయకూడదు. మీరు ఉపయోగించే వస్తువులను వేరుగా ఉంచుకోవాలి. నాలుగు గంటలకు ఒకసారి ఆక్సిజన్ లెవెల్, టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. ఎక్కువగా ద్రవ పదార్ధాలు తీసుకోవాలి. ఆక్సిజన్ లెవెల్ పెంచుకునేందుకు ప్రోనింగ్ ఎక్స్‌ర్‌సైజ్ చేయాలి. రోజుకు మూడుసార్లు ఆవిరి పట్టాలి. ఇలా ఆవిరి పట్టడం ద్వారా మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.  మల్టీ విటమిన్లు, మినరల్స్, రోగ నిరోధక శక్తిని పెంచే పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా గూగుల్‌లో చూసి ఇష్టానుసారంగా మందులు వాడకూడదు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు రెమ్‌డిసివర్ ఇంజక్షన్‌ను ఉపయోగించకూడదు. డాక్టర్ల సలహా తీసుకోకుండా ఆక్సిజన్ సిలిండర్‌ను ఉపయోగించకూడదు. ఒంటరిగా ఫీల్ అవుతున్నామని ఇంట్లో వాళ్ళతో మాట్లాడకూడదు. హోం ఐసోలేషన్ లో ఇవి తప్పకుండా పాటించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: