చంద్రబాబు దగ్గర వ్యూహాలకు కొదవ లేదు. అస్త్రాలకు అంతకంటే కొరత లేదు. కానీ వాటిని ఉపయోగించాల్సిన పరిస్థితులు కూడా రావాలి కదా. అయితే చాలా మటుకు అనుకూల పరిస్థితులను చంద్రబాబు తనకు తానుగానే సృష్టించుకోగలరు. కొన్ని మాత్రం ఆయన చేతిలో లేవు. వాటి విషయంలోనే ఆయన ఇపుడు తెగ బెంగటిల్లుతున్నారని టాక్.

అదేంటి అంటే ఎన్నికలు. ఇపుడే లోకల్ బాడీస్ కి ఎన్నికలు అయ్యాయి కదా మళ్ళీ ఏమిటి అని అనుకుంటారేమో. ఆ ఎన్నికలు కాదు. ఏకంగా పెద్ద ఎన్నికలే. అంటే అసెంబ్లీ ఎన్నికలు అన్న మాట. బాబును ముఖ్యమంత్రిని చేసే ఎన్నికలు. దీని మీద కూడా చాలా డౌట్లు మళ్ళీ వచ్చేస్తాయి. రెండేళ్ల క్రితమే కదా ఎన్నికలు జరగాయి. మళ్ళీ ఇదేంటి అని. కానీ బాబు కోరుకుంటున్నది జమిలి ఎన్నికలను.

అంటే ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ కి ఎన్నికలు పెట్టాలని బీజేపీ ఎప్పటి నుంచో ఆలోచన చేస్తోంది కదా. అది తీరకపోతుందా అని బాబు చాలా కాలంగా చూస్తున్నారు. అయితే ఆ ఆశలను మొదటి విడత కరోనా వచ్చి కొంత గండి కొట్టింది. అయినా సరే చాలా వరకూ ఆశలు మిగిలి ఉన్నాయనుకుంటే రెండవ విడత కరోనా వచ్చి మొత్తానికి మొత్తం లేకుండా చేసిందిట. మొన్న జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికలతోనే కరోనా వచ్చిపడిదని లోకమంతా దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి.

ఈ నేపధ్యంలో జమిలి ఎన్నికలు 2022 అంటే ఈసారి టోటల్ గా  సీన్ రివర్స్ అవుతుంది. దానికి తోడు సెకండ్ వేవ్ తరువాత మోడీ ఇమేజ్ కూడా బాగా దెబ్బతింది అని బీజేపీ కూడా మధనపడుతోంది. ఈ టైమ్ లో జమిలి ఎన్నికలు పెట్టే దుస్సాహసం అసలు చేయరు అంటున్నారు. అంటే ఎటు నుంచి ఎలా చూసుకున్నా కూడా 2024లో షెడ్యూల్ ప్రకార‌మే ఎన్నికలు జరుగుతాయన్నమాట. ఇప్పటి నుంచి చూస్తే మరో మూడేళ్ళు బిగిసి ఉంది. సో. బాబు బహు దూరపు బాటసారిలా అక్కడి దాకా నడుస్తూ వెళ్ళాలన్న మాట.





మరింత సమాచారం తెలుసుకోండి: