సైబరాబాద్ సీపీ సజ్జనార్ కూకటపల్లి కాల్పుల కేసుకి సంబంధించి మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 29 న కూకటపల్లి లోని హెచ్ డీ ఎఫ్ సి ఏటీఎం సెంటర్ లో జరిగిన కాల్పుల ఘటనను ఛేదించాము అని ఆయన తెలిపారు. సెక్యూటీ గార్డ్ పై కాల్పులు జరిపి 5 లక్షలు దోచుకెళ్లారు అని అన్నారు. అజిత్ కుమార్ , ముఖేష్ కుమార్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసాం అని వివరించారు. నిందితులు ఇద్దరు బీహార్ కు చెందిన వారు అని అన్నారు. వారి వద్ద నుండి 6 లక్షల 31 వేలు నగదు, వేపన్ -01, మ్యాగజిన్-01, లైవ్ రౌండ్స్ -3.2, మొబైల్ ఫోన్స్ -03, టూ విల్లర్ వెహికిల్ -01, స్వాధీనం చేసుకున్నాం అని తెలిపారు.

జీడిమెట్ల లో జరిగిన కేసులో కూడా వీరే ప్రధాన నిందితులు అని అన్నారు. ఆర్ధిక ఇబ్బందులు, తాగుడికి బానిస అయి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు అని విమర్శించారు. అజిత్ కుమార్ పై గతంలో 2018 దుందిగల్ లో బ్యాంక్ లో ఉన్న క్యాషియర్ ను బెదిరించి పారిపోయారు అని అప్పట్లో అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు అని వివరించారు. 30 వేలు స్నేహితుడికి ఇచ్చి కంట్రీ వేపన్ బీహార్ నుండి తీసుకొచ్చారు అని తెలిపారు. గతంలో కూడా అనేక నేరాలకు పాల్పడ్డారు అనిఆయన వివరించారు.

చోరీ చేసిన పల్సర్ బైక్ మీద వచ్చి కూకటపల్లి లో కాల్పులకు తెగబడ్డారు అని కాల్పుల్లో సెక్యూటీ గార్డ్ అలీ ఛాతికి బుల్లెట్ తగిలింది అని తెలిపారు. దింతో సెక్యూటీ గార్డ్ అలీ బేగ్ చనిపోయాడు అని వివరించారు. సైబరాబాద్ 3 కేసులు, రాచకొండ లో ఒక కేసు నిందితుల పై నమోదు అయ్యాయి అని పేర్కొన్నారు. పక్క సమాచారం తోని కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు అని అన్నారు. సయింటిఫిక్ ఏవిడెన్స్,టెక్నికల్ ఏవిడెన్స్ కలెక్ట్ చేసి నిందితులను గుర్తించామని తెలిపారు. తక్కువ సమయంలో నిందితులను పట్టుకున్నామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: