కోవిడ్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉప సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని, మంత్రి కన్నాబాబు మీడియాతో మాట్లాడారు. ఆక్సిజన్, రేమిడిసివిర్, బెడ్స్ ,హోమ్ ఐసోలేషన్, కోవిడ్ కేర్ సెంటర్ ల పై చర్చించాం అని వారు అన్నారు. తిరుపతి లో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చర్చించాం అని వివరించారు. ఆక్సిజన్ సరఫరా కు స్పష్టమైన మార్గదర్శకాలు సీఎం ఇచ్చారు అని తెలిపారు. ఆక్సిజన్ పైప్ లైన్ లు వెంటనే వెరిఫై చేయాలని అదేశించాము అని అన్నారు.

ఆక్సిజన్ డిమాండ్ ను బట్టి పంపిణీ కి ఏర్పాటు చేసామని తెలిపారు. 20వేలకు పైబడి ఇప్పుడు కేస్ లు వస్తున్నాయి అని వారు వివరించారు. 11000 ఆక్సిజన్ బెడ్స్ ఇప్పటికే సమకూర్చుకున్నాం ఐ వివరించారు. ఆక్సిజన్ బెడ్స్ కి ట్రెండర్ లు  పిలిచారు అని అన్నారు. 590 మెట్రిక్ తన్నులు ఆక్సిజన్ వాడుతున్నాం అని వివరించారు. ఇక ఇదిలా ఉంటే రుయా విషాద ఘటన పై తిరుపతి ఆర్డీవో ను కలిసి బిజెపి నేతలు ఫిర్యాదు చేసారు. ఆర్డీవో ను కలిసిన  బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధులు భాను ప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్... ఈ మేరకు ఫిర్యాదు చేసారు.

భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటన ఘోర తప్పిదం అని అన్నారు. ఆసుపత్రి పై నిఘా ఉంచాల్సిన అధికారుల నిర్లక్ష్యం అని మండిపడ్డారు. జిల్లా యంత్రాంగం ఏం చేస్తోంది? అని నిలదీశారు. గ్రీన్ ఛానల్ లోకి తీసుకొచ్చి ఉంటే చాలా మంది బతికే వారు  అని అన్నారు. చనిపోయిన వారి వివరాలు చెప్పటం లో నిర్లక్ష్యం కనిపిస్తోంది అని విమర్శించారు. అధికారులు ఎవరి మెప్పు కోసం లెక్కల్ని దాస్తున్నారు అని మండిపడ్డారు.  బిజెపి జిల్లా స్థాయి నేత టీఎస్ రామారావు ఆ సమయంలో రుయాలో చనిపోయారు అని ఆయన పేరు 11మందిలో లేదు అని ఆవేదన వ్యక్తం చేసారు. అసలు మొత్తం లెక్కల్లో తప్పిదాలు ఉన్నాయి అని అన్నారు. రెండు రోజులు అవుతోంది ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? అని ఆయన నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: