ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది ఏంటనే దానిపై పలు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని అంశాల్లో కాస్త జాగ్రత్తగానే ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు వేసే అడుగుల గురించి ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీని మరోసారి చంద్రబాబు నాయుడు దగ్గరకు తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం కూడా ఎక్కువగానే జరుగుతున్నది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ బలపడాలంటే ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్లీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లి తెలుగుదేశం పార్టీ పూర్తిగా నష్టపోయిన సంగతి తెలిసిందే. కానీ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీతో కలిసి రాష్ట్రంలో పోరాటం చేయాలని భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది.

తాజాగా తిరుపతిలో జరిగిన ఘటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీతో అలాగే వామపక్షాలతో కలిసి చంద్రబాబు నాయుడు పోరాటం చేయడమే కాకుండా సంయుక్త ప్రకటన చేశారు. ఈ ప్రకటన తర్వాత అనేక అనుమానాలు మొదలయ్యాయి. మళ్లీ జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీతో సహా మమతాబెనర్జీతో అలాగే ఇతర వామపక్షాలతో కలిసి ముందుకు వెళ్లే ఆలోచన చేస్తున్నారని అదేవిధంగా పశ్చిమబెంగాల్లో మమత ద్వారా కొన్ని పార్టీలను దగ్గర చేసుకునేందుకు చంద్రబాబు నాయుడు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు అనే వార్తలు వినపడుతున్నాయి. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: