న్యూఢిల్లీ: దేశంలో కరోనా అల్ల కల్లోలం సృష్టిస్తోంది. ప్రతి రోజు లక్షల్లో కేసులు పెరిగిపోతున్నాయి. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ కోవిడ్ రెస్పాన్స్ టీమ్ (సీఆర్‌టీ) ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే సీఆర్‌టీను ఆర్ఎస్ఎస్ సహా ఇతర పౌర సేవల సంఘాలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజల్లో ఆత్మ విశ్వాన్ని, పాజిటివిటీని నింపేందుకు సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.


 ఇందులో భాగంగా ప్రముఖుల ఉపన్యాసాల చేత ప్రజలను ఉత్తేజపరచాలని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్, విప్రో గ్యూప్ స్థాపకుడు అజీం ప్రేమ్‌జీ, ఆధ్యత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ వంటి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే కరోనా మహమ్మారి సమయంలో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచడమే ఈ కార్యక్రమం లక్ష్యమని సీఆర్‌టీ కన్వీనర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు.


 ఈ ప్రసంగాలు ఆరెస్సెస్‌కు చెందిన ‘విశ్వ సంవాద్ కేంద్రం’ ఫేస్‌బుక్, యూట్యూబ్ పేజీల్లో ప్రసారమవుతాయన్నారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ పని తీరును తప్పుబట్టారు. ఈ  కార్యక్రమ లక్ష్యం అయినవారిని కోల్పోయి బాధలో ఉన్న వారిని పరిహసించడమా అని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మవిశ్వాసం, పాజిటివ్ థింకింగ్ అని ఉపన్యాల పేరిట బాధిత కుటుంబాలపై జోకులేస్తున్నారని, ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచాలంటే కరోనా మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొని చూపించమని అన్నారు.


 అంతేకాకుండా రాష్ట్ర ఆసుపత్రుల్లో ఉన్న ఆక్సిజన్, పడకల కొరతను గుర్తుచేశారు. అంతేకాకుండా కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక సంక్షోభంలో ఉన్న వారిని, ఆరోగ్య సిబ్బందిపై జోకులు వేయడం ఈ పాజిటివ్ థింకింగ్ భరోసా అని రాహుల్ అన్నారు. ఇటువంటి కార్యక్రమాలను చేయడం ప్రజలకు ద్రోహం చేయడమేనని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: