దేశంలో రాజకీయాలు ఎలా నడుస్తాయో సరిగ్గా చెప్పలేం గానీ, ఏపీలో రాజకీయాలు మాత్రం ఎప్పుడు కులాల ఆధారంగానే నడుస్తూ ఉంటాయి. కొన్ని దశాబ్దాల నుంచి ఏపీలో రాజకీయాలు కులాల మీదే ఆధారపడి జరుగుతున్నాయి. అందులోనూ కమ్మ, రెడ్డి కులాల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కులాలకు చెందిన వారే రాష్ట్రాన్ని పాలిస్తున్నారు.


తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే కమ్మ సామాజికవర్గం డామినేషన్ ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అలాగే ఒకప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే రెడ్డి వర్గం హవా ఎక్కువగా ఉండేది. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడంతో, ఆ స్థానంలో వైసీపీ వచ్చింది. ఇక వైసీపీలో రెడ్ల ఆధిపత్యం ఉంటుందని చెప్పాల్సిన పనిలేదు. రెండేళ్ల ముందు వరకు అధికారంలో ఉన్న టీడీపీలో కమ్మ నేతల హవా ఎక్కువగా ఉంటే, ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీలో రెడ్డి సామాజికవర్గం డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది.


ఇక వీరి రాజకీయం కూడా ఇలాగే నడుస్తుంటుంది. గతంలో జగన్ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు టీడీపీలో కమ్మ సామాజికవర్గానికే ప్రాధాన్యత ఉండేది అని విమర్శలు చేసేవారు. ఇప్పుడు జగన్ అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలు రివర్స్ అయ్యారు. వైసీపీలో రెడ్లకే ప్రాధాన్యత ఉంటుందని మాట్లాడుతున్నారు. అయితే వీరి కుల రాజకీయం నిత్యం జరుగుతూనే ఉంది. ఇక కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని కబళించేస్తున్న కూడా వీరి కుల రాజకీయం ఆగలేదు. ఆఖరికి కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్ విషయంలో కుల పోరు నడుస్తోంది. కరోనాకు సంబంధించిన కోవ్యాక్జిన్ టీకా తయారుచేసిన భారత్ బయోటెక్‌ని నడిపేది కమ్మ కులానికి చెందినవ్యక్తి అని, ఆ వ్యక్తి రామోజీరావు, చంద్రబాబు బంధువు అని సీఎం జగన్ సైతం విమర్శిస్తున్నారు.


అందుకే రాష్ట్రానికి వ్యాక్సిన్ అందడం లేదని మాట్లాడుతున్నారు. మళ్ళీ వ్యాక్సిన్ పంపిణీ కేంద్ర పరిధిలో ఉంటుందని చెబుతూనే, కమ్మ కులాన్ని వైసీపీ టార్గెట్ చేసింది. అసలు వ్యాక్సిన్ విషయంలో కూడా కులాన్ని తీసుకురావడం ఏపీ నేతలకే చెల్లుతుందేమో. ఏదేమైనా జగన్-చంద్రబాబులు కుల రాజకీయం చేయనిదే ఉండలేరు అనుకుంటా. 


మరింత సమాచారం తెలుసుకోండి: