చంద్రబాబుని అరెస్ట్ చేయడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం ముందుకెళుతుందా? అంటే అబ్బో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అదే పనిలో ఉందని అర్ధమైపోతుంది. జగన్ ప్రభుత్వం ఓ వైపు ప్రజలకు మేలు చేస్తూనే, మరోవైపు ప్రతిపక్ష టీడీపీపై మరింత కక్షపూరితంగా వ్యవహరిస్తుందని తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూలేని విధంగా వైసీపీ ప్రభుత్వం, టీడీపీ నేతలపై కేసులు పెట్టింది.


అయితే టీడీపీ నేతల తప్పులు కూడా లేకపోలేదు. కానీ ప్రభుత్వం మరీ వన్‌సైడ్‌గా వ్యవహరించడం కూడా కాస్త అనుమానపడాల్సి వస్తుంది. కావాలనే ప్రభుత్వం టీడీపీ నేతలకు చుక్కలు చూపిస్తుందనే చెప్పొచ్చు. రాష్ట్రంలో చాలామంది టీడీపీ నేతలపై కేసులు వచ్చి పడ్డాయి. అలాగే కొందరి బిజినెస్‌లపై దెబ్బపడింది.


ఇక పలువురు టీడీపీ నేతలు జైలు పాలయ్యి, బెయిల్ మీద బయటకొచ్చారు. ఇలా జైలుకెళ్లినవారిలో కొందరికి కరోనా కూడా వచ్చింది. ప్రస్తుతం సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్రది కూడా అదే పరిస్తితి. అయితే జగన్ ప్రభుత్వం కేవలం టీడీపీ నేతలనే కాదు, టీడీపీ అధినేత చంద్రబాబుని కూడా టార్గెట్ చేసింది. అసలు ఈ రెండేళ్లలో చంద్రబాబుపై అనేక కేసులు నమోదయ్యాయి. అలాగే ఆయన్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలని బాగానే ప్రయత్నించారు. ఇక తాజాగా కూడా చంద్రబాబుపై కేసులు వచ్చి పడ్డాయి. ఏపీలో ఎన్440-కె వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని చంద్రబాబు ప్రజలని అలెర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయం పలువురు శాస్త్రవేత్తలు కూడా గుర్తించారని చెప్పారు.


అయితే ఇదంతా నిజం కాదని, చంద్రబాబు కావాలనే ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పి, కర్నూలు, గుంటూరుల్లో కేసులు పెట్టారు. అసలు కేసులు నమోదవ్వడమే ఆలస్యం పోలీసులు బాబుకు నోటిసులు ఇవ్వడానికి హైదరాబాద్ సైతం వెళ్లారు. కానీ ఇదే కరోనా వేరియంట్ గురించి మంత్రి అప్పలరాజు కూడా మాట్లాడటంపై కేసులు నమోదయ్యాయి. దీంతో బాబు విషయంలో పోలీసులు వెనక్కి తగ్గినట్లు తెలిసింది. ఏదేమైనా బాబుని అరెస్ట్ చేయడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం ముందుకెళుతుందనే చెప్పొచ్చు.     


మరింత సమాచారం తెలుసుకోండి: