ఏపీలో ఎలాంటి మేటర్ అయినా సరే దానిపై రాజకీయం జరగాల్సిందే. ప్రతి అంశాన్ని రాజకీయం చేయకుండా ఏపీ నేతలు ఖాళీగా ఉండరు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఫస్ట్ వేవ్‌లో రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టిన కరోనా...సెకండ్ వేవ్‌లో సునామీలా విరుచుకుపడుతుంది. అయితే ప్రజల నిర్లక్ష్యం కావొచ్చు, ప్రభుత్వం అలసత్వం కావొచ్చు. సెకండ్ వేవ్ మరింత దారుణంగా ఉంది. రోజుకూ 20 వేల పైనే కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. అలాగే పదుల సంఖ్యలో మృతిచెందుతున్నారు.


అయితే ఆక్సిజన్ అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇందులో ప్రభుత్వం తప్పిదం వల్ల కూడా కొంతమంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఇంత జరుగుతున్నా కూడా ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు మాత్రం రాజకీయం చేయడం ఆపడం లేదు. ప్రతి అంశాన్ని రాజకీయంతో ముడిపెట్టేస్తున్నారు.


ఆఖరికి వ్యాక్సిన్‌పై కూడా రాజకీయం చేస్తున్నారు. కరోనా రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా భారత్ బయోటెక్ సంస్థ కోవ్యాక్జిన్‌ని తయారుచేసింది. అయితే మొదట్లో ప్రభుత్వం గానీ, ప్రజలు గానీ వ్యాక్సిన్ వేసుకోవడానికి ఆసక్తి చూపలేదు. కానీ కరోనా తీవ్రమయ్యాక, వ్యాక్సిన్ కోసం ఎగబడ్డారు. దీంతో దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత వచ్చింది. అయితే చాలా రాష్ట్రాలు ఏదొకవిధంగా వ్యాక్సిన్ కొనుగోలు చేస్తున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం వ్యాక్సిన్ కొనుగోలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని టీడీపీ విమర్శలు చేస్తుంది. ఒక 1600 కోట్లు పెడితే వ్యాక్సిన్ వచ్చేస్తుందని మాట్లాడుతున్నారు. అయితే ఆ డబ్బు చంద్రబాబుకే ఇస్తామని వ్యాక్సిన్ కొనాలని వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.


అసలు వ్యాక్సిన్ తయారుచేసిన భారత్ బయోటెక్ అధిపతి కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అని, రామోజీరావు, చంద్రబాబులకు బంధువు అని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే నాయకులు విమర్శలు చేయడం మామూలే కానీ, సీఎం జగన్ సైతం ఇదే తరహా విమర్శలు చేస్తున్నారు. వ్యాక్సిన్ ఎలా తీసుకురావాలనే దానిపై సీరియస్‌గా దృష్టిపెట్టకుండా, కమ్మ కులాన్ని, చంద్రబాబు, రామోజీరావులని టార్గెట్ చేసి మాట్లాడారు. అసలు సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఈ స్థాయి విమర్శలు చేయడం కాస్త ఎబ్బెట్టుగానే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి విమర్శల జోలికి జగన్ వెళ్లకపోవడం మంచిదని అంటున్నారు.   లేదంటే జగన్ ఇమేజ్ మీద ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: