దేశంలో రోజురోజుకు విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. ఇప్పటికే మొదటి రకం వైరస్ విజృంభించి   ఎంతో మందిని పొట్టనపెట్టుకుంది. ఇక ఇప్పుడు రెండవరకం వైరస్ అంతకుమించి అనే రేంజ్లో మరణ మృదంగం మోగిస్తూ ఎంతో మందిని బలి తీసుకుంటుంది.  రోజు రోజుకు పరిస్థితులు మరింత అధ్వానంగా మారిపోతున్నాయి. కరోనా వైరస్ మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో అటు స్మశానాల్లో కూడా చోటు దొరకని పరిస్థితి నెలకొంటుంది. కొన్ని రాష్ట్రాలలో అయితే మరింత దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి.



 ఈ క్రమంలో జీవితంలో ఎప్పుడు చూడలేము అనుకున్నా హృదయ విదారక దృశ్యాలను కూడా చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే గంగానదిలో మృతదేహాలను వదిలేసిన ఘటన ఎంతోమందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ ఘటన మరువక ముందే ఉన్నావోలో దానికి మించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి స్థానికులు పలు కరోనా మృత దేహాలను గంగానది ఒడ్డున ఇసుకలో పాతి పెడుతున్న దృశ్యాలు ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయ్.  శుక్లగంజ్ హాజీపూర్లో  గంగా ఘాట్ వద్ద   ఏకంగా నది తీరం స్మశాన వాటిక గా మారిపోయింది



 రోజురోజుకు కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్నా వారి సంఖ్య పెరిగి పోతున్న నేపథ్యంలో స్మశానవాటికలో మృతదేహాలకు దహనం నిర్వహించేందుకు కర్రలు లేకుండా పోయాయి. అంతేకాకుండా స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు అధిక వ్యయం అవుతూ ఉన్న నేపథ్యంలో చాలా మంది ఇక తమ అయిన వారి మృతదేహాలను ఇసుకలో పూడ్చి పెడుతున్నట్లు తెలుస్తోంది. వారి ఆచారాలకు భిన్నంగా వేరే గత్యంతరం లేక ఇలా మృతదేహాలను ఇసుక దిబ్బల్లో పెడుతున్నారు ఇక ఇటీవల ఏకంగా 13 మృతదేహాలను ఇసుక దిబ్బల్లోనే కననం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది కరోనా వైరస్ కారణంగా రోజురోజుకూ ఎన్నో హృదయ విదారక ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: