దేశంలో కరోనా కేసుల లెక్కలు చూస్తుంటేనే వీధి వీధికి కరోనా పేషెంట్లు ఉన్నారనే విషయం అర్థమైపోతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బెడ్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి వీలైనంత వరకు హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటూ మన ఆరోగ్యాన్ని సంరక్షించుకొని ఈ మహమ్మారి నుండి బయటపడడం మంచిది. కాబట్టి ఒకవేళ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది అంటే ముందుగా అలాంటివారు హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లి పోవాలి. ఆ తర్వాత పలు జాగ్రత్తలు తీసుకుని ఈ వైరస్ బారి నుండి బయట పడాలి. హోమ్ ఐసోలేషన్ ఉన్న సమయంలో అశ్రద్ధ వహించరాదు. ఏమి చేయాలి ? ఏమి చేయకూడదు అని తెలిసి ఉండాలి. లేదంటే అది మన ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.
 అయితే హోమ్ ఐసోలేషన్ లో  ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ?  ఎలా ఉండాలో ? ఇప్పుడు తెలుసుకుందాం.

* కరోనా సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఉండరాదు, విడిగా వేరే గదిలో ఉండాలి. దీని వలన మీ నుండి మీ కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందకుండా ఉంటుంది.
ఒకవేళ వాళ్లతోనే కలసి ఉండాల్సి వస్తే ముఖానికి రెండు మాస్కులు ధరించి ఉండాలి. అదేవిధంగా ఇంట్లోని సభ్యులు సైతం నిత్యం మాస్క్ వేసుకోవాలి.

 
* రెండు గంటలకు ఒకసారి శానిటైజర్ ను చేతికి రాసుకుంటూ ఉండాలి.


* ఉదయం పూట ఎండ బాగా పడే ప్రాంతంలో కూర్చోవాలి.


* ఒకవేళ మీరు కనుక వేరే గదిలో ఉన్నట్లు అయితే, గాలి వెలుతురు బాగా వచ్చే గదిలో ఉండటం మంచిది.


*ఏవేవో ఆలోచనలతో మానసిక ఒత్తిడికి లోనుకాకుండా మీకు నచ్చిన వారికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండడం, కాలక్షేపానికి ఏమైనా సినిమాలు కానీ కామెడీ వీడియోలు కానీ చూడటం మంచిది.


* అనవసరంగా సోషల్ మీడియాలో చూపించే కషాయాలను తాగకండి అలాగే ఇతర వైద్య పద్ధతులను పాటించకండి. మీరు ఏమి చేయాలనుకున్నా డాక్టర్ అనుమతితోనే చేయాలి. లేదంటే అవి కొత్త సమస్యలకు దారితీస్తాయి.

 
*ఈ సమయంలో మంచి బలమైన పోషకాహారాన్ని తీసుకోవాలి.


* వీలైనంత వరకు మీరు వాడిన మాస్క్ లను తిరిగి వాడటం బదులు, పడేయటం మంచిది. 
కానీ వాటిని చాలా జాగ్రత్తగా ఏదైనా ప్లాస్టిక్ కవర్ లో కానీ, పేపర్ లో గాని చుట్టి ఆ తర్వాత డస్ట్ బిన్ లో వేయాలి. లేదంటే ఇతరులకు సోకే అవకాశం ఉంది.
 
*ఖచ్చితంగా ప్రతిసారి వేడి నీటిని మాత్రమే తాగండి.


* వేడి వేడి పాలు కానీ, కాఫీ కానీ ఉదయం సాయంత్రం తాగండి.


* ఊపిరి ఆడటం లేదు అని అనిపిస్తే బోర్లా పడుకొని ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నించండి.


*ఆక్సి మీటర్ ను మీకు అందుబాటులో ఉంచుకోండి.


*ఒకవేళ ఆక్సిజన్ లెవెల్స్ కనుక 94 కంటే తక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.


*చాలామంది ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్ లను  ఇంట్లోనే రెడీగా పెట్టుకుంటున్నారు. కానీ డాక్టర్ల సలహా లేకుండా వాటిని వినియోగించడం ఏమాత్రం మంచిది కాదు. అన్నింటికన్నా ముఖ్యం మన ఆరోగ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: