ఏపీలో జగన్ చంద్రబాబుల మధ్య వ్యవహారం ఉప్పూ నిప్పూలా ఉంటుంది అన్నది రాజకీయం తెల్సిసిన వారికి అర్ధమైన విషయమే. ఇదిలా ఉంటే చంద్రబాబు జగన్ ఏ మంచి చేసినా మెచ్చుకోరు.  పైగా ఏ చిన్న తప్పు జరిగినా గట్టిగ విమర్శిస్తారు. మరో వైపు జగన్ కూడా చంద్రబాబు విషయంలో ఎక్కడా తగ్గరు. ఇలా ఏపీలో వైసీపీ టీడీపీల మధ్య రాజకీయ సమరం అలా సాగుతూనే ఉంటుంది.

ఈ నేపధ్యంలో జగన్ మంత్రి ఆళ్ళ నాని అయితే చంద్రబాబుకు భారీ ఆఫర్ ప్రకటించారు. వ్యాక్సిన్ల విషయంలో మమ్మల్ని రోజూ విమర్శిస్తున్న చంద్రబాబు తన పలుకుబడి ఉపయోగించి ఏపీకి అవసరం అయిన ఏడున్నర కోట్ల డోసులు తెస్తే మొత్తం క్రెడిట్ ఆయనకే రాసి ఇచ్చేస్తామంటూ భారీ ప్రకటనే చేశారు. ఏపీకి ఏడున్నర కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ అవసరం అయితే కేంద్రం నుంచి ఇప్పటిదాకా పలు విడతలుగా  వచ్చింది 73 లక్షలు మాత్రమే అని ఆయన గణాంకాలు చెప్పారు. మరి ఈ లెక్కన ఎప్పటికి కరోనా వ్యాక్సిన్ పూర్తి అవుతుంది అన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు

దీంతో జగన్ ప్రభుత్వం మీద టీడీపీ విమర్శలు రోజురోజుకూ పదునెక్కుతున్నాయి. దానికి విరుగుడు అన్నట్లుగా మంత్రి ఆళ్ళ నాని చంద్రబాబు వ్యాక్సిన్లు తేవాలని, ఆయనకు భారత్ బయోటిక్ ఫార్మా కంపెనీతో ఉన్న పలుకుబడిని ఉపయోగించాలని కూడా కోరారు. బాబు కనుక ఆలా చేస్తే మొత్తం రాజకీయ లాభాన్ని ఆయనే తీసుకోవచ్చునని కూడా ఆళ్ళ అంటున్నారు. బాబు ఈ విషయంలో తన పలుకుబడిని ఉపయోగించగలరా అంటూ ఆళ్ళ సూటిగానే ప్రశ్నిస్తున్నారు.

మొత్తానికి ఇదేదో బాగానే ఉన్నట్లుంది. భారత్ బయోటిక్ ఫార్మా కంపెనీతో బాబుకు పరిచయాలు ఉన్నాయని అంతా అంటున్నారు. ఈ సమయంలో బాబు కనుక రిక్వెస్ట్ పెట్టి ఏపీకి ఎక్కువగా కోవాగ్జిన్ వ్యాక్సిన్ దక్కేలా చూస్తే వైసీపీ ఎటూ మీదే గొప్పదనం అంటోంది. దాని కంటే ముందే జనాలే నీరాజనాలు పడతారు. మరి బాబు ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: