తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల ప్రజల్లో కూడా ఆగ్రహం పెరిగిపోయింది. దాదాపు నెల రోజుల నుంచి రోజురోజుకీ కేసులు భారీగా పెరుగుతున్న సరే సీఎం కేసీఆర్ మాత్రం నిర్ణయం తీసుకునే విషయంలో వెనకడుగు వేసారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా సరే ఆయన సమీక్షలు కూడా జరపడానికి ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా నిర్ణయం తీసుకోవడంతో అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ అంశానికి సంబంధించి టిఆర్ఎస్ పార్టీ నేతలలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రజల ను కట్టడి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా తప్పులు చేస్తూనే ఉంది. వైన్ షాప్ లను ఓపెన్ చేసి ఉంచాలి అని నిర్ణయం తీసుకోవడం వెనక అర్థం ఏంటి అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. 6 గంటల నుంచి 10 గంటల వరకు వైన్ షాప్ ఓపెన్ చేసి ఉంచితే ప్రజలు భారీగా వచ్చే అవకాశం ఉంటుంది. దీనితో కరోనా కేసులు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కాబట్టి ఈ నిర్ణయం మంచిది కాదు అంటూ సూచనలు చేస్తున్నారు. అయినా సరే సీఎం కేసీఆర్ ఈ విషయంలో వెనక్కు తగ్గే అవకాశాలు కనపడటం లేదని చెప్పాలి. అంతే కాకుండా షరతులు పెట్టే విషయంలో సీఎం కేసీఆర్ పక్షపాతం చూపిస్తున్నారు అని ఆరోపణలు కూడా ఉన్నాయి. హడావుడిగా నిర్ణయం తీసుకున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఉన్న కేసులకు సంబంధించి వాస్తవాలు బయట పెట్టడం అనే అభిప్రాయం కూడా చాలావరకు ప్రజల్లో వ్యక్తమవుతోంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: