ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మరొక పార్టీ తో కలిస్తే మాత్రం జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వామపక్షాలతో కలిసి తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసి ముందుకు వెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు కలవడంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరింత ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు నాయుడు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులతో చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయంలో ఈ మధ్య కాలంలో ప్రజల్లో సానుకూలత పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే విధంగా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ విషయంలో సానుకూలంగా ఉన్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు అటు వైపు చూస్తున్నారని భారతీయ జనతా పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని భావించిన సరే ఇప్పుడు ఆయన అటు వైపు చూడటం లేదని కూడా అంటున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకుల వైఖరి కారణంగా గతంలో నష్టపోయిన చంద్రబాబునాయుడు ఇప్పుడు మరోసారి ఆ పార్టీతో కలవడానికి సిద్ధంగా లేరని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఓడిపోయే అవకాశం ఉందని అంచనా వేసుకున్న ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి దగ్గర కావడం కంటే కూడా కాంగ్రెస్ పార్టీకి లేదా ఇతర విపక్షాలు దగ్గర కావడమే మంచిదనే అభిప్రాయంతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: