ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లకపోవడంతో అనవసరంగా ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయక పోవడంతో సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేవలం మీడియా ముందు హడావుడి చేయడం మాత్రమేనని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం లేదని ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తే లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే ఇప్పుడు నష్టాల నుంచి బయటపడతారా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వినబడుతున్నాయి.

ఇప్పుడు ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు అని తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసినా సరే ప్రజలకు ఇప్పుడు కావాల్సింది ధైర్యం కావాలని అంటున్నారు. ఆక్సిజన్ సిలిండర్ల విషయంలో మందుల విషయంలో ప్రజల్లో చాలా వరకు ఆందోళన ఉందని ఈ ఆందోళనకు సంబంధించి వైసిపి నాయకులు కూడా జోక్యం చేసుకుని ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో కార్యకర్తలు కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని అంటున్నారు.

అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయాలు సాధించిన వాళ్లు కూడా సైలెంట్ గా ఉండడంపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో చాలా వరకు కూడా వైసీపీ విజయం సాధించింది కానీ సర్పంచులు కూడా ఇప్పుడు ప్రజలకు అందుబాటులో కనబడటంలేదు. తమ తమ గ్రామాల్లో ఏం జరుగుతుందో కూడా సర్పంచులకు తెలియడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే సర్పంచులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా కూడా పార్టీ నాయకులు కొన్ని సమస్యలు ఎదుర్కోవడం అదే విధంగా ప్రజల్లో కూడా అభిప్రాయాలు మారిపోవడంతో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లడానికి చాలా మంది నాయకులు ఆసక్తి చూపించడం లేదు. భవిష్యత్తులో ఇదే విధంగా కొనసాగితే పరిస్థితి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్ కూడా నాయకులకు ధైర్యం కల్పించే ప్రయత్నం చేయలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: