మౌనం అర్థవంతం ఎప్పుడవుతుందంటే, మౌనంగా ఉండాల్సిన చోట మాత్రమే మౌనంగా ఉన్నప్పుడు. అలాగే మాట్లాడాల్సిన సమయంలో మౌనంగా ఉండటం, మౌనంగా ఉండాల్సిన సమయంలో మాట్లాడటం  వలన ఏ ఉపయోగం ఉండదు. కాలం అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుందంటారు.. కానీ మౌనం అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పదు. నోరు విప్ప‌క‌పోతే ఎవ‌రికి తోచిన భాష్యాన్ని వారు చెప్పుకుంటారు.. అది స‌క్ర‌మంగా ఉండ‌వ‌చ్చు.. లేదా వ‌క్రంగానూ ఉండొచ్చు!!

స్మ‌శానాల్లో స్థ‌లం లేదు!!
స్మ‌శానాల్లో శవాలకు  స్థ‌లం లేదు.. గ్రామాల నుంచి నగరాల వరకు ప్ర‌తిరోజు రోద‌న‌లు మిన్నంటుతున్నాయి.. రాష్ట్రాల నుంచి ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి.. కోర్టుల్లో న్యాయ‌స్థానాల ఎదుట ప్ర‌భుత్వ న్యాయ‌వాదులు త‌ల దించుకుంటున్నారు.. మీరెందుకు మాట్లాడ‌టంలేదంటూ ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు..  ప్ర‌జ‌ల ప్రాణాలు క‌రోనా గాలిలో క‌లిసిపోతున్నాయి.. ప్ర‌పంచంలో వ్యాక్సిన్ త‌యారీ కంపెనీల్లో 70 శాతం మ‌న‌ద‌గ్గ‌రే ఉన్నాయి.. కానీ ఈరోజు వ్యాక్సిన్ కేంద్రాలు క‌రోనా హాట్‌స్పాట్లుగా మారుతున్నాయి.. దూర‌దృష్టి ఎందుకు కొర‌వ‌డింద‌ని వైద్య నిపుణులు అడుగుతున్నారు.. లాక్‌డౌన్ ఎందుకు పెట్ట‌లేద‌ని ప్ర‌పంచ దేశాలు ప్ర‌శ్నిస్తున్నాయి.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇచ్చి ప్ర‌పంచాన్ని కాపాడిన భార‌త్ ను ఇప్పుడు ఎవ‌రు కాపాడ‌తార‌నేది సందిగ్ధంగా మారింది.. ఎన్ని ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్న‌ప్ప‌టికీ అన్నింటికీ స‌మాధానం ఒక‌టే వ‌స్తోంది.. అదే మౌనం.. మౌనం.

మౌనం స‌రైన వ్యూహం కాదు!!
దేశంలో నెల‌కొన్న విప‌త్క‌ర ప‌రిస్థితుల మ‌ధ్య కా మౌనం పాటించ‌డం స‌రైన వ్యూహం అనిపించుకోదు. సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం లేని పరిస్థితిని ప్ర‌ధాన‌మంత్రే క‌ల్పించారంటే అతిశ‌యోక్తి కాదు. ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన త‌ర్వాత ఏనాడూ విలేక‌రుల స‌మావేశాలు పెట్ట‌లేదు.. ఎవ‌రి ద‌గ్గ‌ర‌నుంచి స‌ల‌హాలు తీసుకోలేదు.. ఎవ‌రితోను సంభాషించ‌లేదు.. ప్రశ్నించినవారికి ఊపిరాడని పరిస్థితి కల్పించారు. తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి వాతావరణాన్నీ వాస్తవాలతో సంబంధం లేకుండా త‌న మూఢ‌భక్తుల అండతో, భావోద్వేగాలతో తిప్పిగొట్టే ప్రయత్నం చేశారు. చెన్నైలో చైనా అధ్య‌క్షుడితో చేతిలో చేయివేసి బీచ్‌లో ఆహ్లాద‌క‌రంగా ప‌ర్య‌టించారు.. అమెరికా వెళ్లి భారీ స‌భ ఏర్పాటుచేసి ఈవెంట్ మేనేజ్‌మెంట్ నిర్వ‌హించారు. ఇప్పుడు క‌రోనాను నియంత్రించ‌డానికి కూడా అటువంటి వ్యూహాలు ర‌చించ‌వ‌చ్చుక‌దా!! అని ప్ర‌తిప‌క్షాలు నిల‌దీస్తున్నాయి.. అయినా స‌మాధానం రావ‌డంలేదు.. ఎందుకంటే దేశం వ్యూహాత్మ‌క మౌనం పాటిస్తోంది??.

మరింత సమాచారం తెలుసుకోండి: