సీషెల్స్ అనేది భారతీయ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీపసమూహం. ఇది తూర్పు ఆఫ్రికాకు చెందిన దేశం. కరోనా వైరస్ ప్రపంచంపై పంజా విసరడంతో చాలా దేశాలు లాక్‌డౌన్ బాట పట్టాయి. దీంతో ఆర్థికంగా కుదేలయ్యాయి. ఈ క్రమంలో క్రమంగా ఆంక్షలను ఎత్తేస్తూ వచ్చాయి. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో పర్యాటక రంగం ద్వారా తిరిగి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే వ్యాక్సిన్ వేసుకున్న విదేశీ పర్యాటలను స్వాగతం పలుకుతుండగా, మళ్లీ సెకండ్‌ వేవ్‌ ప్రారంభమై అతలాకుతలం అవుతున్నాయి. ఇక విదేశీ టూరిస్ట్‌లకు వెల్‌కమ్ చెబుతున్న దేశాల జాబితాలో ముఖ్యంగా సీషెల్స్, థాయ్‌లాండ్, రొమానియా, జార్జియా, ఎస్టోనియా, గ్రీస్ దేశాలు మందు వరసలో ఉన్నాయి. ఈ ఆరు దేశాల్లో కూడా సీషెల్స్ ప్రథమ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడంతో మళ్లీ ఆంక్షలు విధిస్తోంది సీషెల్స్.

ఇతర దేశాల కంటే ఎక్కువగా వ్యాక్సిన్లు వేసిన సీషెల్స్‌ ఇప్పుడు పాఠశాలలు, పార్కులు, పర్యటక ప్రదేశాలు, క్రీడా కార్యకలాపాలను రద్దు చేసింది. అలాగే బార్లను త్వరలో మూసివేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ దేశంలో ఉన్న జనాభాలో ఇప్పటి వరకు 60 శాతానికి పైగా టీకాలు వేసినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి పెగ్గి విడోట్‌ మీడియాకు వెల్లడించారు. ఈ దేశం ఎక్కువ భాగం పర్యాటక రంగంపై ఆధారపడి ఉంటుంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి చైనా వ్యాక్సిన్ల విరాళాల ద్వారా జనవరిలో టీకాలు వేయడం ప్రారంభించింది. ఏప్రిల్ 12 నాటికి మోతాదులో 59 శాతం సినోఫార్మ్‌ వ్యాక్సిన్లు, మిగితా కోవిషీల్డ్‌, ఆస్ట్రాజెనెకా టీకాలను వేసింది. ఇప్పటి వరకు ఆ దేశ జనాభాలో 62.2 శాతం మందికి కోవిడ్‌ టీకాలు వేశారు. అయినప్పటికీ సెకండ్ వేవ్ లో ఇక్కడ కూడా కొత్త వేరియంట్ల వైరస్‌లను కనుగొన్నారు. గత ఏడాది చివర్లో గుర్తించిన బి.1.351 వేరియంట్‌ను ఫిబ్రవరిలో సీషెల్స్‌లో గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: