దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వైరస్ సెకండ్‌ వేవ్ ఇన్ఫెక్షన్‌ లక్షణాలను అభివృద్ధి చేస్తున్న విధానంలో మార్పును నివేదిస్తున్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. పరిశోధకులు జాబితాలో కొత్త లక్షణాలను చేర్చారు. ఇప్పటివరకు కొవిడ్‌-19 సాధారణ లక్షణాలు జ్వరం, శరీర నొప్పులు, వాసన, రుచిని కోల్పోవడం, చలిగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కనిపించేవి.

ఇక శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం చాలామందిలో కనుగొనడం జరిగింది. చాలా మంది కరోనా బారిన పడిన వాళ్ళు శ్వాస సంబంధిత సమస్యలకు గురవుతున్నారు. నిజంగా దీని వల్ల చాలా మంది మరణిస్తున్నారు కూడా. ఒక పక్క చూస్తే అక్సిజన్ కొరత కూడా ఉన్నట్లు మనకి తెలుస్తుంది. పింక్ ఐస్‌ లేదా కండ్లకలక అనేది కొవిడ్‌-19 ఇన్ఫెక్షన్‌కు సంకేతం. పింక్‌ ఐస్‌ వచ్చినప్పుడు కంటిలో ఎరుపు, వాపు కనిపిస్తుంది. కన్ను అంతా నీరుగా మారుతుంది. కరోనావైరస్ కొత్త జాతి బారిన పడిన 12 మందిలో ఈ లక్షణాలను పరిశోధకులు గుర్తించారు.

ఈ మధ్యకాలంలో రింగింగ్ ధ్వని లేదా ఒకరకమైన వినికిడి లోపాన్ని గమనించినట్లయితే.. అది కరోనా వైరస్‌ సోకినట్లు సంకేతం కావచ్చని భావించాలి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆడియాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, కొవిడ్‌-19 ఇన్ఫెక్షన్‌ వినికిడి సమస్యలకు దారితీస్తుంది. కరోనా-వినికిడి, వెస్టిబ్యులర్ సమస్యల మధ్య అనుబంధాన్ని గుర్తించిన 56 అధ్యయనాలను పరిశోధకులు కనుగొన్నారు. వినికిడి లోపం యొక్క ప్రాబల్యం 7.6 శాతం అని అంచనా వేయడానికి వారు 24 అధ్యయనాల నుంచి డాటాను సేకరించారు.

కరోనా వైరస్‌ సోకిన వారిలో అనేక జీర్ణశయాంతర ఫిర్యాదులు కూడా వస్తున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. కొవిడ్‌-19 ఎన్ఫెక్షన్‌ ఎగువ శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ, ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. అతిసారం, వాంతులు, ఉదరంలో తిమ్మిరి, వికారం, నొప్పి కరోనావైరస్ సంకేతాలు. మీరు ఏదైనా జీర్ణ అసౌకర్యాన్ని ఎదుర్కొంటుంటే అది కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్‌గా భావించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. జీర్ణ అసౌకర్యాలను ఎవరికి వారే గుర్తించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: