దేశంలో కరోనా ఉధృతి చాలా తీవ్రంగా వుంది. రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో  అధికారులు తమ  రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్ డౌన్ విధించారు.అయినా కానీ కేసులు ఎక్కువవుతున్నాయి తప్ప ఏమాత్రం తగ్గడం లేదు.  రోజుకి 4 లక్షలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇక ఈ కరోనా సెకండ్ వేవ్ ద్వారా కరోనా రోగులు తీవ్రంగా ఎదురుకుంటున్న సమస్య ఏంటంటే ఆక్సిజన్ కొరత. ఇక పరిస్థితిలో ప్రజలకు  ఆక్సిజన్ అనేది  చాలా అవసరం. ఆక్సిజన్ కొరత వల్ల చాలా మంది కరోనా రోగులు అల్లాడిపోతున్నారు. ఆక్సిజన్ అందక రోజు చాలా మంది మృత్యు వాత పడుతున్నారు.అంతలా ఆక్సిజన్ కొరత దేశంలో చాలా ఎక్కువగా వుంది.


ఇక దేశంలో ఎక్కువ కరోనా కేసులు కర్ణాటక రాష్ట్రంలో నమోదవుతున్నాయి. ఇది వరకు మహారాష్ట్ర కరోనా కేసుల విషయంలో మొదటి స్థానంలో ఉండేది. కాని రెండ్రోజుల క్రితం కర్ణాటక    ఎక్కువ కరోనా కేసులు నమోదు చేసి మహారాష్ట్రని దాటి మొదటి స్థానానికి ఎగబాకింది. కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కర్ణాటక లాక్ డౌన్ విధించింది.ఇక కర్ణాటక ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ సిలిండర్ కలిగిన మినీ బస్సులని ఏర్పాటు చేసింది. ఇది నిజంగా మెచ్చుకోదగిన విషయం అని చెప్పాలి. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా కేసులు ఎక్కువయ్యి ఆక్సిజన్ కొరత పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా కర్ణాటక తరహా లాగానే ఆక్సిజన్ సిలిండర్లు కలిగిన మినీ బస్సులని ఏర్పాటు చేసింది. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకి ఆక్సిజన్ అందుతుంది. నిజంగా ఇది ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం అనే చెప్పాలి.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిదని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: