ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. రోజురోజుకు విపత్కర పరిస్థితులు తీసుకొస్తోంది. శర వేగంగా వ్యాప్తి చెందుతూ అందరి పై పంజా విసురుతోంది. విలయ తాండవం చేస్తూ మరణ మృదంగం మోగిస్తోంది కరోనా. ఈ నేపథ్యంలోనే దేశంలో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారిపోతున్నాయి. గత ఏడాది మొదటి రకం వైరస్ తో పోల్చిచూస్తే రెండవ రకం వైరస్ మాత్రం అందరిని గడగడలాడిస్తోంది అనే చెప్పాలి. దీంతో సగటు మనిషి జీవితానికి గ్యారెంటీ లేకుండా పోయింది. ఏ క్షణంలో వైరస్ పంజా విసురుతుంది ఏ క్షణం లో ప్రాణాలను తీస్తుంది అన్నది కూడా ఊహించని విధంగా మారిపోయింది.



 అయితే మొదటి రకం వైరస్ తో పోల్చి చూస్తే రెండవరకం కరోనా వైరస్ ఎక్కువగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఎంతో మంది ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది ఆరోగ్యం విషమించి ప్రాణాలు కూడా వదులుతున్నారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ చికిత్సలో భాగంగా రెమిడీసివర్ ఇంజక్షన్ ను ప్రధానంగా ఉపయోగిస్తున్నారు.  కానీ అక్కడ అక్కడ రెమిడీసివర్ ఇంజెక్షన్ల కొరత కారణంగా ఎంతోమంది ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఇటీవల డి ఆర్ డి ఓ  కరోనా వైరస్ కు సరికొత్త మందు కనిపెట్టేందుకు సిద్ధమైంది. డాక్టర్ రెడ్డిస్ సహకారంతో ఔషధ తయారీకి పూనుకుంది డి ఆర్ డి ఓ.



 ఈ క్రమంలోనే ఇలా కరోనా కు విరుగుడుగా ఒక మందును తయారు చేయడంలో డి ఆర్ డి ఓ  విజయం సాధించినట్లు తెలుస్తోంది.  డి ఆర్ డి ఓ, డాక్టర్ రెడ్డీస్ సహకారంతో కరోనా వైరస్ కి విరుగుడు గా 2డిజి అనే ఔషధం  తయారు చేసింది. పొడి రూపంలో ఉండే ఈ ఔషధాన్ని నీళ్లల్లో కలిపి కరోనా రోగులకు అందిస్తారు. మరో రెండు రోజుల్లో ఈ ఔషధం ఢిల్లీలోని డి ఆర్ డి ఓ ఆస్పత్రికి  చేరనున్నట్లు తెలుస్తోంది. మొదట డి ఆర్ డి ఓ ఆస్పత్రిలో ఈ మందు ఉపయోగించనున్నారు. ఇక ఆ తర్వాత అనుమతులు రాగానే దేశవ్యాప్తంగా ఈ మందు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఇది ఒక శుభ పరిణామం అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: