ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేతలు సమర్థవంతంగా పని చేయకపోతే మాత్రం పార్టీ పరిస్థితి రోజు రోజుకు మరింత దారుణంగా మారే అవకాశాలు ఉండవచ్చు. భారతీయ జనతా పార్టీలో చాలామంది నాయకులు ఒక అభిప్రాయం లేకుండా ముందుకు వెళ్తున్నారు అనే అభిప్రాయం కూడా ఉంది. చాలా మంది నాయకులకు పార్టీ మీద ఒక ప్రణాళిక లేదని పార్టీ నాయకత్వంలో ఒక సఖ్యత లేదు అని ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలను సీరియస్ గా  తీసుకుని పని చేయక పోతే మాత్రం సమస్యల తీవ్రత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసిపి బలం గా కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ బలపడే విధంగా అడుగులు వేస్తుంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించడానికి చంద్రబాబు నాయుడు తన వంతుగా కష్టపడుతున్నారు. జనసేన పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ లో బలపడే విధంగా అడుగులు వేస్తుందని చెప్పాలి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం కాస్తో కూస్తో కనబడింది. కానీ భారతీయ జనతా పార్టీ ప్రభావం మాత్రం ఏ విధంగా కూడా కనపడటం లేదు. ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు కాస్త సీరియస్ గా  రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం అవుతున్న సరే భారతీయ జనతా పార్టీ మాత్రం ఆ విధంగా ప్రయాణం చేయలేకపోతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పనితీరుపై చాలావరకు బీజేపీ కార్యకర్తలలో అనేక అనుమానాలున్నాయి. ఆయన పనితీరు సమర్థవంతంగా లేకపోవడంతో ఇప్పుడు ఆయనను బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా పెద్దగా సమర్థించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర నాయకత్వానికి సోము వీర్రాజుపై ఫిర్యాదులు కూడా వెళ్ళినట్టుగా సమాచారం. త్వరలోనే సోము వీర్రాజు పై ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన ను పక్కన పెట్టడానికి రెడీ అయ్యారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: