తెలంగాణలో కొంత మంది టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రులకు అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపించడానికి కొంత మంది సిద్ధంగా ఉన్నా సరే సీఎం కేసీఆర్ వాళ్ళను పట్టించుకోవడం లేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని కొన్ని అంశాలలో సీఎం కేసీఆర్ చేసిన తప్పుల కారణంగా భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశాలున్నాయని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మాజీ మంత్రి కడియం శ్రీహరి మరో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విషయంలో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి తీవ్ర స్థాయిలో ఇబ్బందులను సృష్టిస్తుందని చెప్పాలి.

కడియం శ్రీహరి విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా అనుకూలంగా ఉంది. తుమ్మల నాగేశ్వరరావు విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్నవ్యవహరిస్తున్న ఈ నేపథ్యంలో నాగేశ్వరరావు కోసం ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత రంగంలోకి దిగారని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కచ్చితంగా మీకు కీలక బాధ్యతను అప్పగిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారని అంటున్నారు. ఈటెల కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ఆలోచనలో ఉన్నారని కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని తుమ్మల నాగేశ్వరరావుకి కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఒకరు హామీ ఇచ్చారని రాజకీయవర్గాలు అంటున్నాయి.

నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారని వార్తలు కూడా వినబడుతున్నాయి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అనుకూల పవనాలు వీయడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ పనితీరుపై కూడా ప్రజల్లో ఆగ్రహం పెరుగుతున్న నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు ఆ దిశగా అడుగులు వేస్తున్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. మరి ఆయన పార్టీ మారతారా లేదా అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం కాస్త ఆసక్తిని రేపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: