కరోనా వైరస్ భారతదేశంలో కట్టలు తెంచుకుంటోంది. గత రెండు రోజుల నుండి మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. దీనితో ప్రజల్లో ఆందోళనలు రెట్టింపు అయ్యాయి. ప్రభుత్వాలు కూడా కరోనా వైరస్ నియంత్రణ కోసం తమ వంతు కృషి చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేసే పనిలో భాగంగా ఇప్పటికే అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నాయి. అయితే ఐసిఎంఆర్ సూచనల మేరకు లాక్ డౌన్ ను మరింత కఠినతరం చేయాల్సి ఉంది. కానీ దీనిపై ఇంకా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడం లేదు. ఇది ఇలా ఉంటే జీవిత బీమా కంపెనీలు కరోనా సోకిన వారికి షాక్ ఇచ్చే నిబంధనలను తీసుకువచ్చింది. కరోనా సోకిన వారికి ఇకపై ఏదైనా ఆరోగ్య జీవిత బీమా పొందాలంటే మరింత కష్టతరం కానుంది. ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావంతో క్లెయిమ్స్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకోసం బీమా సంస్థలు కొత్త నిబంధనలను కస్టమర్స్ కోసం తీసుకువచ్చాయి. 

ఒకవేళ మీరు కరోనా నుండి కోలుకున్నా కానీ, వెంటనే జీవిత బీమా పొందే అవకాశం ఉండదు.  మామూలుగానే కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారు, ఇలాంటి వారికి ఆరోగ్య బీమాలు చేసే ముందు కంపెనీ వారు కొన్ని ఆంక్షలను పెడతారు. ఆంక్షలు పెట్టినా అన్ని రిపోర్ట్స్ పర్ఫెక్ట్ గా ఉన్న తరువాతనే బీమా పాలసీ ని ఇష్యూ చేస్తారు. అయితే కరోనా వైరస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి కాకపోయినప్పటికీ దీని తీవ్రతను దృష్టిలో పెట్టుకుని, అలాగే ముందు ముందు థర్డ్ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతుండడంతో బీమా కంపెనీలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కరోనా సోకిన వారి ఆరోగ్య పరిస్థితిపై తక్కువ కాలంలో ఒక అంచనాకు రావడం కష్టతరం. ఈ వైరస్ ప్రభావం శరీరంలో అన్ని అవయవాలపై ప్రభావం చూపిస్తుండడంతో బీమా కంపెనీలు నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నాయి

కరోనా రోగులు కానీ లేదా కరోనా నుండి కోలుకున్న రోగులు కానీ ఆరోగ్య బీమా కోసం అప్లై చేసుకుంటే, కనీసం ఆరు నెలల వరకు పాలసీ ని పొందే అవకాశం లేదు. ఇందులోని ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన కాల వ్యవధిని పెట్టుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు 6 నెలలుగా, మరికొన్ని కంపెనీలు 3 నెలలు సమయాన్ని పెట్టారు. అంతే కాకుండా కరోనాకి సంబంధిచిన ప్రతి ఒక్క రిపోర్ట్ ఖచ్చితంగా బీమా కంపెనీలకు సమర్పించాలి. దాని తరువాత కూడా స్వయంగా బీమా కంపెనీ తరపున కొన్ని ఆరోగ్య పరీక్షలను చేసిన తరువాతనే పాలసీ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తుంది. ఒక వేళ అన్ని పరీక్షల తరువాత పరిగణలోకి తీసుకున్నా ఎక్కువ మొత్తంలో ప్రీమియంను చెల్లించాలని చెబుతున్నాయి. ఈ విషయాలను బట్టి కరోనా రోగులు ఆరోగ్య జీవిత బీమా పొందాలంటే ఇక కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: