ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. సంక్షేమ కార్యక్రమాలను ఎలా అయినాసరే ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి జగన్ ఒక ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పుడు భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. ఇలా నిధులు ఖర్చు చేయడం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా పూర్తిగా వెనుకబడి పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి .ప్రజలు కూడా ఆర్థికంగా మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దివాలా పరిస్థితిలో ఉంది అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. భవిష్యత్తులో ముఖ్యమంత్రి జగన్ ఆదాయాన్ని పెంచుకోకుండా కేవలం అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే మరిన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుందని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఆర్థిక సంక్షోభం అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మళ్ళీ రాష్ట్రాలన్నీ ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే భారీగా రాష్ట్రాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలకు ఉచితంగా డబ్బులు ఇవ్వడం ద్వారా రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను పూర్తిగా కట్టడి చేసే ఆలోచనలో ఉంది అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఆర్ధిక రంగం లో ఉన్న కీలక అధికారులు అందరూ కూడా సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: