దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి ఒక ప్రణాళిక లేకుండా కేంద్ర ప్రభుత్వం వెళ్లడంతో ఇప్పుడు అనేక సమస్యలు వస్తున్నాయి అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. రాజకీయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ఉన్న శ్రద్ధ వేరే ఏ ఇతర అంశాల్లో కూడా లేకపోవడంతోనే దేశంలో ఇప్పుడు సమస్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సమర్థవంతంగా సహకారం అందించలేకపోతే మాత్రం మరణాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. తీవ్రమైన కేసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సమర్ధవంతంగా వెళ్లడం లేదు అనే అభిప్రాయం కూడా ఉంది.

ఇక వ్యాక్సిన్ తయారీ విషయంలో రాష్ట్రాలకు పూర్తిగా స్వేచ్ఛ లేకపోవడంతోనే రాష్ట్రాలన్నీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు వ్యాపారం చేస్తున్నారన్న భావన కూడా చాలామందిలో వ్యక్తమవుతోంది. వ్యాక్సిన్ విషయంలో కేంద్రం వ్యాపారాలు చేయడంతోనే రాష్ట్రాలు కూడా సీరియస్ గా ఉన్నాయని అంటున్నారు. అయితే ఇప్పుడు బీజేపీ పాలిత ముఖ్యమంత్రుల కేంద్రం చాలా సీరియస్ గా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని కొంతమంది బిజెపి ముఖ్యమంత్రులు ఇప్పటికే ఫోన్ లో మాట్లాడుకున్నారని సమాచారం.

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతున్నారని సమాచారం. వీరిద్దరూ కూడా ఏం చేయాలి ఏంటనే దానిపై ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లే అవకాశం ఉందని... ఈ రెండు రాష్ట్రాలు కూడా కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి గ్లోబల్ టెండర్లు కు వెళ్లే అవకాశం ఉంది అని కొంతమంది వ్యాఖ్యనిస్తున్నారు. ఇప్పటికే మూడు నాలుగు రాష్ట్రాలు ఈ ఆలోచన చేస్తున్నాయి. త్వరలోనే ఈ రెండు రాష్ట్రాలు కూడా అదే ఆలోచనతో ముందుకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: