దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో వేరే పార్టీలేవీ కూడా కలిసి వచ్చే ప్రయత్నం చేసే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నారు అని ప్రచారం మూడు నాలుగు రోజులనుంచి గట్టిగా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లేందుకు చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు ఆయన ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు అంటూ వార్తలు వినపడుతున్నాయి.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో అడుగు పెడితే ఆయనకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టి 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు మళ్లీ ఆయన జాతీయ రాజకీయాలపై అడుగుపెడితే పార్టీలో కూడా చాలావరకు విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సమర్థవంతంగా తెలుగుదేశం పార్టీ పోరాటం చేయలేకపోతోంది.

కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల వైపు చూస్తే అనవసరంగా సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక పార్టీలో ఉన్న చాలా మంది కార్యకర్తలు కూడా పార్టీ కోసం పెద్దగా పని చేయడానికి ఇష్టపడకపోవడం తో చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో వేలు పెడితే పార్టీ కార్యకర్తలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందంటున్నారు. ఇక నాయకుల విషయంలో కూడా సఖ్యత లేకపోవడంతో అనవసరంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే పార్టీని సంస్థాగతంగా ఇబ్బంది పెట్టుకోవడమే అనే భావన చాలా మందిలో ఉంది. మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా అడుగులు వేస్తారు పార్టీని ఎంత వరకు సమర్థవంతంగా ముందుకు నడిపిస్తారనేది చూడాలి. జాతీయ స్థాయిలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సైలెంట్ గా ఉండటమే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: