విశాఖపట్నంలో 300 పడకల ఆస్పత్రిని ప్రారంభించిన సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ 79 హాస్పిటల్స్ పనిచేస్తున్నాయి అని అన్నారు. 6500 బెస్ట్ అందుబాటులో ఉన్నాయి అని వివరించారు. అయినప్పటికీ బెడ్ సరిపోవడం లేదు అని మండిపడ్డారు. ఆక్సిజన్ , ఇంజక్షన్ , వాక్సినేషన్ కూడా అన్నీ కేంద్రం ఆధీనంలోనే ఉన్నాయి అని తెలిపారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది అని అన్నారు. వైద్యం ఇప్పుడు అందుబాటులోకి వస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు.

వాక్సినేషన్  కొరత ..  ప్రభుత్వం ఎన్ని చేసినప్పుడు కూడా ఇబ్బందులు ఉన్నాయి అని వివరించారు. ముఖ్యమంత్రి నిర్దేశం ఇక్కడ వాస్తవ రూపం దాలుస్తుంది అని ఆయన వెల్లడించారు. ప్రగతి భారతి ఫౌండేషన్ మంచి సేవలు అందిస్తుంది అని చెప్పుకొచ్చారు. ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి దేశంలోని అత్యుత్తమైన వైద్యసేవలు ఆంధ్రప్రదేశ్లో అందిస్తున్నారు అని వివరించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సిద్ధాంతం తో ముందుకు వెళ్తున్నారు అని ఈ సందర్భంగా వివరించారు.

ప్రగతి భారతి ఫౌండేషన్, ప్రభుత్వ సహకారంతో 300 పడకల కోవిడ్ సెంటర్ని ఏర్పాటు చేసాం అని తెలిపారు. విశాఖ రాజధాని రాబోతున్న తరుణంలో, అవసరమని గుర్తించి దీన్ని ఏర్పాటు చేశాం అని అన్నారు. ప్రభుత్వం కొవిడ్ ఆసుపత్రిగా గుర్తించాలి అని కోరారు. ఇక్కడ పేషెంట్లకు అన్ని రకాల టెస్టులు నిర్వహిస్తారు.. వెంటిలేటర్స్ మాత్రం ఇక్కడ లేవు.. సీసీ కెమెరాల ద్వారా వారి పరిస్థితిని నేరుగా చూడొచ్చు అని అన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని మాట్లాడుతూ విశాఖ మహానగరంలో ప్రగతి భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమం అని అన్నారు. ప్రస్తుతం పరిస్థితి లో ఆక్సిజన్ అవసరం చాలా ఉంది అని తెలిపారు. ఆక్సిజన్ సరఫరా కి సంబందించి పూర్తి జాగ్రత్త లు  తీసుకున్న చెదురుమదురు ఘటనలు  ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అన్నారు. ఆక్సిజన్ సరఫరా 200 మెట్రిక్ టన్నుల నుంచి 600 మెట్రిక్ టన్నులకు పెంచిన సరిపోవడం లేదు అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: