చంద్రబాబు రాజకీయ చాణక్యానికి మరో మారు పదును పెట్టబోతున్నారా. మూడేళ్ల తరువాత జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఆయన ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారా. మాస్టర్ ప్లాన్ తో ఆయన వైసీపీని ఢీ కొట్టబోతున్నారా అంటే సమాధానం అవును అనే వస్తోంది.

చంద్రబాబుకి 2024 ఎన్నికలు చాలా కీలకం. ఇంకా చెప్పాలంటే అగ్ని పరీక్ష కూడా. ఒక విధంగా బాబు రాజకీయ జీవితానికి ఇవి చివరి ఎన్నికలు అని కూడా చెప్పుకోవాలి. 2024 నాటికి చంద్రబాబు వయసు 74కు చేరుకుంటుంది. ఆ ఎన్నికల్లో గెలవడం ఆయనకు చాలా అవసరం కూడా. ఒక వేళ ఓటమి ఎదురైతే మాత్రం 2029 వరకూ బాబు వెయిట్ చేయాలి. అప్పటికి ఎనభయ్యేళ్లకు దగ్గరకు చేరుతారు. అంటే ఆ ఏజ్ లో పోరాడడం అసాధ్యం

కాబట్టి చంద్రబాబుకి ఎలా చూసుకున్నా 2024 ఎన్నికలే అతి ముఖ్యం. దాంతో బాబు ఈసారి జనాలకు అప్పీల్ చేయబోతారట. తనను గెలిపించాలని, ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని కూడా బాబు సానుభూతి కార్డు వాడుతారు అంటున్నారు. అదే విధంగా చంద్రబాబు లాస్ట్ చాన్స్ అంటూ జనాలకు విన్నవించుకుంటారు అంటున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ ఒక్క చాన్స్ అంటూ అడిగితే జనాలు ఇచ్చారు  కాబట్టి బాబు లాస్ట్ చాన్స్ అంటే కచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారుట.

ఏపీలో అభివృద్ధి బాటన నడిపిస్తానని, యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతాను అని బాబు చెప్పబోతారని ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. జగన్ ఏలుబడిలో సంక్షేమం బాగా ఉన్నా అభివృద్ధి ఉపాధి రంగాలు మాత్రం పెద్దగా అడుగులు ముందుకు వేయలేదు. దాంతో వాటినే తాన బాణాలుగా చేసుకుని జగన్ మీద పోరాడుతారు అంటున్నారు. మొత్తానికి లాస్ట్ చాన్స్ అంటూ బాబు చేసే అప్పీల్ కి ఏపీ జనాలు పడతారా. చాన్స్ ఇస్తారా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: