ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కాస్త సీరియస్ గా తీసుకున్నారు. అరెస్ట్ వ్యవహారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా రఘురామకృష్ణంరాజుని ఇబ్బంది పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఈ నేపథ్యంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఈ అంశానికి సంబంధించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు మిగిలిన వాళ్ళందరూ కూడా స్పందించారు. అలాగే టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కూడా ఈ అంశానికి సంబంధించి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని కీలక ప్రశ్నలు వేశారు. రఘురామకృష్ణంరాజుని అరెస్టు చేశారు కాబట్టి వైసీపీ ఎంపీలు భరత్ అదేవిధంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ ని కూడా అదుపులోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా కు సంబంధించి ఎటువంటి చర్యలు కూడా సమర్థవంతంగా తీసుకోలేదు అని కాబట్టి వారిపై కూడా కేసులు పెట్టాలని...

రాజమండ్రిలో రోజు 100 మంది చనిపోతున్నారు అని ఒక లైవ్ వీడియో లో వైసీపీ ఎంపీలు వ్యాఖ్యలు చేశారని కాబట్టి వాళ్ల మీద కూడా కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ వారిని అదుపులోకి తీసుకోకపోతే నిజంగా రాజమండ్రి లో 100 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అని అదే ప్రభుత్వ చేతగానితనం అని నారా లోకేష్ ఆరోపణలు చేశారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఈ అంశానికి సంబంధించి సీరియస్ గానే ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాన్ని మరింత ఇబ్బంది పెట్టేందుకు నారా లోకేష్ ఈ ప్రశ్నలు వేసినట్లుగా తెలుస్తోంది. మరి దీనికి అధికార పార్టీ ఏం అంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: